Ex IPS Narasaiah: ఆరోజు చెప్పులు విసిరింది ఎన్టీఆర్ కి కాదు… లక్ష్మి పార్వతికి… వెన్నుపోటు చంద్రబాబుది కాదు…: విశ్రాంత ఐపీఎస్ అధికారి నరసయ్య

Ex IPS Narasaiah : ప్రతిపక్షాలు చంద్రబాబును విమర్శించాలంటే వెన్ను పోటు అనే అంశాన్ని తెరమీదకు తెస్తారు. మామకు వెన్నుపోటు పొడిచి పార్టీ లాక్కున్నావ్ అంటూ మాట్లాడుతారు. అయితే అందులో నిజానిజాలు అప్పటి నాయకులకు తప్ప నేటి తరానికి ఎవరికీ స్పష్టంగా తెలియదు. ఎన్టీఆర్ పార్టీని లక్ష్మి పార్వతి చేతిలో పెడుతున్న సమయంలో చంద్రబాబు టీడీపీ పార్టీని కాపాడాడు అంటూ మరో వెర్షన్ మనకు వినిపిస్తుంది. అయితే అసలు ఏం జరిగింది అనే విషయాల మీద ఏపీ మాజీ సీఎం ఎన్టీఆర్ గారి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ అయిన నరసయ్య గారు ఎన్టీఆర్ శత జయంతి సందర్బంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు.

ఆరోజు చెప్పు విసిరింది ఆయన మీదకు కాదు…

ఎన్టీఆర్ గారు బోలా మనిషి అని ఆయనను దగ్గరగా చూసినా ఎవరైనా చెప్పే మాట. ఆయన జీవితంలోకి లక్ష్మి పార్వతి ప్రవేశించాక ఆయనకు సేవలు చేయడానికి వచ్చానంటూ వచ్చి పెళ్లి చేసుకున్నాక రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం మొదలు పెట్టింది అంటూ నరసయ్య తెలిపారు. టీడీపీ శ్రేణుల్లో చాలా మంది నాయకులకు ఆమె జోక్యం నచ్చలేదు. ఎన్టీఆర్ కి అనుకూలంగా కొంతమంది మినహాయించి దాదాపు 160 మందికి పైగా ఎమ్మెల్యేలు అశోక్ గజపతిరాజు దేవేందర్ గౌడ్ వంటి నాయకులను ఎన్టీఆర్ తో ఈ విషయం గురించి మాట్లాడటానికి పంపించగా భార్య రాజకీయాల్లో ఎందుకు జోక్యం చేసుకోరాదు అంటూ ఆయన వాదించి వారిని కూడా పార్టీ నుండి సస్పెండ్ చేయాలనుకున్నారు అంటూ తెలిపారు.

అలాంటి సమయంలో పార్టీ ని కాపాడుకోడానికి అందరూ కలిసి చంద్రబాబు వద్దకు వెళ్లారు. తప్పని పరిస్థితుల్లోనే ఆయన పార్టీ తీసుకున్నారు. ఇక వైశ్రాయ్ హోటల్ లో జరిగిన ఇష్యూలో కూడా లక్ష్మి పార్వతి అక్కడికి రాకుండా ఉండుంటే పార్టీ పక్కకి పోయేది కాదు, ఆ సంఘటన జరిగేది కాదు. ఆ చెప్పులు వేసింది కూడా ఆయన మీద కాదు లక్ష్మి పార్వతి మీదికి అంటూ చెప్పారు నరసయ్య. రెండు సార్లు చంద్రబాబు పార్టీని కాపాడారు. నాదెండ్ల ఎపిసోడ్ లో కాంప్ రాజకీయాలు చేసినపుడు ఎమ్మెల్యేలను బెంగళూరు తీసుకెళ్లి అక్కడి నుండి హైదరాబాద్ కి తీసుకువచ్చినపుడు కూడా చంద్రబాబు కీలక పాత్ర వహించారు. ఆ నాడు చంద్రబాబు సరిగా చూసుకోకపోయుంటే పార్టీనే ఉండేది కాదు అంటూ తెలిపారు.