Ex Minister DL Ravindhra reddy : బర్త్ డే రోజు ఇంత పెద్ద స్కామా?? వైస్సార్ కొడుకు ఇంత అవినీతి పరుడా?? వైఎస్ జగన్ పై మాజీ మంత్రి డిఎల్ రవీంద్ర రెడ్డి సంచలన కామెంట్స్..!

Ex Minister DL Ravindhra Reddy : కడప జిల్లాకు చెందిన మాజీ మంత్రి డిఎల్ రవీంద్ర రెడ్డి సీఎం జగన్ మీద సంచలన ఆరోపణలు చేసారు. సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ అభివృద్ధిని పక్కన పెట్టి ఎక్కువగా ఉచిత పథకాలతో పాలన సాగిస్తున్న సీఎం జగన్ మీద అవినీతి ఆరోపణలు చేసారు. వైస్సార్ కి సన్నిహితుడుగా కడప జిల్లా రాజకీయనాయకుల్లో ఒకరిగా ఉన్న రవీంద్ర రెడ్డి జగన్ మీద ఆరోపణలు చేయడం కొంత షాకింగ్ గా అనిపించింది. ప్రెస్ మీట్ పెట్టి మరీ జగన్ పుట్టినరోజు నాడు ప్రకటించిన ఒక పథకం అందులో జరుగుతున్న అవినీతి గురించి మాట్లాడారు రవీంద్ర రెడ్డి.

వైస్సార్ కొడుకు అవినీతి పరుడా…

జగన్ పుట్టినరోజును పురస్కరించుకుని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా 688 కోట్ల విలువ గల సామ్ సంగ్ టాబ్స్, 778 కోట్ల బైజూస్ కంటెంట్ తో కలిపి మొత్తంగా 1466 కోట్ల ప్రయోజనాలను ఇస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ఈ పథకం కింద విద్యార్థులకు బైజూస్ వాళ్ళు ఇచ్చే కంటెంట్ ని విద్యార్థులు అభ్యసించాలి అలానే ఉపాధ్యాయులు కూడా అదే కంటెంట్ ను పాఠశాలలో బోధించాలి. ఈ పథకం బాపట్ల జిల్లా చుండూరు మండలం ఎడ్లపల్లి గ్రామంలో ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఇక ఈ పథకం ఒక కుంభకోణం అంటూ రవీంద్ర రెడ్డి ఆరోపణలు చేసారు. కడప జిల్లాకు చెందిన ఇద్దరు రెడ్డి బ్రదర్స్ బైజూస్ తో మీడియేషన్ చేసి ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చారు. బైజూస్ ఆల్రెడీ స్కాంలో ఇరుక్కుంది.

బైజూస్ అంకుర సంస్థ గా అందులో జపాన్, అమెరికా కు చెందిన మదుపరులు పెట్టుబడులు పెట్టి అందులో ఏ కంటెంట్ లేదని తెలిసి కేసు వేశారు. రాజస్థాన్, కేరళ బైజూస్ ను బాన్ చేసింది. అలాంటి బైజూస్ ను తీసుకొచ్చి రాష్ట్రంలో విద్యార్థులకు అందిస్తున్నారు. బైజూస్ ఇందులో బాగా లాభపడనుంది. ప్రభుత్వంతో ఒప్పందం కాబట్టి భవిష్యత్తులో ఆ రిఫరెన్స్ చూపించుకుని పబ్లిక్ ఇష్యూ కి వెళ్లాలన్నది ఆ సంస్థ ప్లాన్. ఇక ఇందులో కమిషన్ రెడ్డి బ్రదర్స్ అలాగే సీఎం కు అందుతుంది. ఇలా జగన్ అధికారంలోకి వచ్చాక అవినీతికి పాల్పడుతాడని అనుకోలేదంటూ రవీంద్ర రెడ్డి గారు అభిరప్రయపడ్డారు.