Kaikala Satyanarayana: కైకాలకు పద్మ పురస్కారం ఎందుకు రాలేదు ? కారణం అదేనా ?

Kaikala Satyanarayana: కైకాల సత్యనారాయణ ఈయన గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.ఆరు దశాబ్దాల నుంచి ఇండస్ట్రీలో నటుడిగా కొనసాగుతూ సుమారు 750 చిత్రాలకు పైగా నటించి ఎంతో గుర్తింపు సంపాదించుకొని చలనచిత్ర పరిశ్రమకు ఎంతో సేవ చేసిన కైకాల సత్యనారాయణకు ఇప్పటివరకు ఒక్క పద్మ అవార్డులు కూడా రాకపోవడం గమనార్హం.

తాజా గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 128 పద్మ అవార్డులను ప్రదానం చేశారు. ఈ క్రమంలోనే రెండు తెలుగు రాష్ట్రాలలోను ఆరుగురికి ఈ అవార్డు వరించింది.అయితే వీరిలో కైకాల సత్యనారాయణకు అవార్డు రాకపోవడంతో ఎంతో మంది సినీ ప్రముఖులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు చేశారు.

ఆరు దశాబ్దాల నుంచి కైకాల సత్యనారాయణ ఎన్నో విభిన్నమైన పాత్రలో హీరోగా, విలన్ గా, తండ్రిగా తాత పాత్రలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయనకు ఇప్పటివరకు అవార్డు రాకపోవడం ఎంతో విడ్డూరం. ఇప్పటికీ ఈయన సేవలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు గుర్తించలేదు అంటూ విమర్శలు చేశారు.

టీడీపీ ఎంపీగా పని చేయడమే కారణమా…

అయితే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో సత్యనారాయణకు పద్మ అవార్డు ఇవ్వాలని ఎఫ్‌డీసీ కమీషనర్‌గా పనిచేసిన రమణాచారి, అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ పీఎస్సం జయ్ బారు సిఫార్స్ చేసినా.. ఆయనకు పద్మ అవార్డు రాలేదు. అందుకు గల కారణం అప్పుడు కైకాల టీడీపీ ఎంపీగా పని చేశారు.ఆ ఒక్క కారణంతోనే తనకు పద్మ అవార్డుకు అడ్డు పడ్డారని ఒకానొక సమయంలో కైకాల ఈ విషయం గురించి విచారం వ్యక్తం చేశారు. అందుకే ప్రతిభ ఉన్నవారికి కాకుండా రాజకీయ పార్టీలతో సంబంధం ఉన్నవారికి మాత్రమే పద్మ అవార్డులు దక్కుతున్నాయి అంటూ పలువురు ప్రభుత్వాలపై విమర్శలు చేస్తున్నారు.