Cash Programme: బుల్లితెరపై సుమ వ్యాఖ్యాతగా వ్యవహరించే కార్యక్రమాలలో క్యాష్ దొరికినంత దోచుకో ఒకటి. ఈ కార్యక్రమం ద్వారా సుమ చేసే రచ్చ మామూలుగా ఉండదు. ప్రతివారం ప్రసారమౌతూ ప్రేక్షకులకు కావలసినంత వినోదాన్ని పంచుతున్న ఈ కార్యక్రమం ఈవారం ప్రసారమయ్యే ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు.
ఈ ప్రోమోలో భాగంగా ఈ కార్యక్రమానికి రియల్ కపుల్స్ సిద్ధార్థ వర్మ – విష్ణు ప్రియ వచ్చారు. అదేవిధంగా రీల్ కపుల్ గా ఎంతో మంచి పేరు తెచ్చుకున్న రవి కృష్ణ -నవ్య స్వామి హాజరయ్యారు.ఇక ఈ నలుగురితో సుమ ఎప్పటిలాగే తనదైన శైలిలో వీరి పై పంచులు వేస్తూ షో మొత్తం సందడి చేసినట్లు తెలుస్తోంది.
ఈ ప్రోమోలో భాగంగా సుమ వీరితో లిప్ స్టిక్ లీగ్ కాన్సెప్ట్ పెట్టారు. ఇందులో భాగంగా విష్ణు ప్రియ సిద్ధార్థ్ వర్మ పాల్గొన్నారు. సుమ అడిగిన ప్రశ్నలకు విష్ణు ప్రియ తన భర్త సిద్ధార్థ వర్మకి ముద్దు పెట్టాలి. తన బుగ్గల పై పెదాల గుర్తు సరిగా పడితే తను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పే పనిలేదు. లేదంటే సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఇక ఈ కాన్సెప్టులో విష్ణుప్రియ ముద్దులు పెడుతుంటే.. రవి కృష్ణ సినిమా వారి వంక ఆశ్చర్యంగా చూశారు.
ఇక వీరిద్దరూ రియల్ కపుల్స్ కాబట్టి ఈ కాన్సెప్ట్ పెట్టారు. రవికృష్ణ నవ్య స్వామి రీల్ కపుల్ కావడంతో ఈ కాన్సెప్ట్ కాకుండా వీరితో పుష్ప సినిమాలోని ఉ అంటావా మామ… ఊ.. ఊ అంటావా మామ అనే ఫ్లోర్ స్టెప్ వేయించారు. దీంతో నెటిజన్లు పెద్దఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ విధంగా పెళ్లి కాని వారిని మీ కార్యక్రమానికి పిలిచి వారితో ఇలాంటి ఐటమ్ సాంగులకు స్టెప్పులు వేయించడం ఏంటి అంటూ పెద్దఎత్తున ఫైర్ అవుతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…