Flash Back : సినిమా ఛాన్స్ ఇవ్వడానికి వచ్చిన దర్శకున్ని హంతకుడు అంటూ తరిమికొట్టిన హీరోయిన్..

ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్లుగా రాణించిన హీరోయిన్ల లో రాధిక ఒకరు. టాప్ హీరోయిన్ గా వరుస చిత్రాలు చేసిన ఆమె ఇప్పటికీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన నటనా జీవితాన్ని కొనసాగిస్తూనే ఉంది. అయితే ఈమె చేసిన కొన్ని చిలిపి పనులు గురించి తెలిస్తే పడి పడి నవ్వడం గ్యారంటీ. ఒక దర్శకుడిని దొంగ దొంగ అంటూ తరిమి కొట్టింది మరొక అసిస్టెంట్ డైరెక్టర్ నీ కోపంతో ముప్పతిప్పలు పెట్టింది. ఇంతకీ విషయం ఏమిటంటే …

తన సినిమాలో కొత్త హీరోయిన్ కోసం వెతుకుతున్న ప్రముఖ తమిళ దర్శకుడు భారతి రాజ కు తెలిసిన వారు రాధిక గురించి చెప్పారు. దాంతో ఆయన వేతుక్కుంటు రాధిక వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఆ టైం లో బాగా బొద్దుగా ఉన్న రాధిక జుట్టు విరబోసుకుని తన ఇంటి గార్డెన్ లో చెట్లకు నీళ్ళు పోస్తూ ఉంది. ఇంతలో డైరెక్టర్ భారతి రాజ గేటు తీసుకుని ఇంట్లోకి వచ్చారు. ఆయనను చూసిన రాధిక ముందుగా కంగారు పడింది…ఎందుకంటే ఆయన డైరెక్టర్ అన్న విషయం ఆమెకు తెలీదు, అదీకాక ఆ ముందు రోజే వాళ్ళ వీధిలో ఒక అగాంతకుడు హత్య చేశాడు.

మరి భారతి రాజ ఏమో రింగు రింగుల జుట్టుతో కాస్త రఫ్ గా కనిపించడం తో రాధిక కంగుతింది. వెంటనే దొంగ పో దొంగ పో అంటూ అరచి తరిమికొడితు నాన రచ్చ చేసింది. ఇంతలో ఆమె కుటుంబ సభ్యులు అందరూ బయటకు రావడం తో భారతి రాజా తను ఒక దర్శకుడు అని చెప్పి వారిని నమ్మించడానికి నానా తంటాలు పడ్డారు. అలా తన ఇంటికి వచ్చిన డైరెక్టర్ భారతి రాజ ను ముప్పతిప్పలు పెట్టించి మూడు చెరువుల నీరు తాగించింది హీరోయిన్ రాధిక.

కట్ చేస్తే ఆయన సినిమాలోనే హీరోయిన్ గా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు. రాధిక ప్రముఖ నేటి ఎం ఆర్ రాధ కూతురు. బాగా డబ్బులున్న అమ్మాయి. లండన్ లో చదువు, లక్సరి లైఫ్ జీవితం. అయితే అంతా గారాబంగా పెరిగిన రాధికకు కాస్త ముక్కు మీద కోపం కూడా ఎక్కువే. చిన్న వయసు పెద్దల గారాబం, దాంతో తనని ఎవరైనా ఏమైనా అంటే అస్సలు ఊరుకునేది కాదు. కాగ తన మొదటి సినిమా భారతి రాజ దర్శకత్వం లో పనిచేస్తున్నప్పుడు ఆ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా భాగ్య రాజ చేస్తున్నారు. ఆయన రాధికను చూసి దర్శకుడు భారతి రాజ తో ఎంటి సార్ గుమ్మడికాయ లాంటి అమ్మాయి ఈమె హీరోయిన్ ఆ అన్నారట. అయితే తన మీద కంప్లైంట్స్ చెబుతున్నాడు అన్న కోపంతో డైలాగ్స్ ను కావాలనే సరిగా చెప్పకుండా భాగ్య రాజ ను మామూలుగా ఇబ్బంది పెట్టలేదు.

దాంతో విసుగు చెందిన భాగ్య రాజా నేరుగా భారతి రాజ వద్దకు వెళ్ళి విషయం చెప్పగా…ఆయన రాధికను పిలిపించి ఎది ఒక సారి డైలాగ్ చెప్పమ్మా అన్నారట… దాంతో రాధిక బారెడు డైలాగ్ నీ సింగిల్ టేక్ లో అదిరిపోయేలా చెప్పి ఆశ్చర్యపరిచింది. అప్పటికి కానీ అర్థం కాలేదు అసిస్టెంట్ డైరెక్టర్ భాగ్యరాజా కు రాధిక తను కావాలనే ఏడిపించింది అని. ఆ తరవాత ఆయన రాధికను పిలిచి ఎంటమ్మ అని నచ్చా చెప్పారు, రాధిక కూడా భాగ్య రాజ కు సారి చెప్పింది. వీటిద్దరు మంచి స్నేహితులుగా మారారు. భాగ్య రాజ దర్శకుడు గా మారారు ఆయన ఏ సినిమా తీసినా హీరోయిన్ గా మొదటి ఆప్షన్ రాదికనే… ఆమె డేట్స్ కలిగే లేకపోతే మాత్రం వేరే హీరోయిన్ అలా వారి బాండింగ్ ఉండేది.