Manchu Lakshmi: తిరుపతిలో మోహన్ బాబు ఇంటిని హోమ్ టూర్ చేసిన మంచు లక్ష్మి… ఎంత అందంగా ఉందో?
Manchu Lakshmi: మంచు లక్ష్మీ ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.మోహన్ బాబు కుమార్తెగా, నటిగా, వ్యాఖ్యాతగా అందరికీ ఎంతో సుపరిచితమైన మంచు లక్ష్మి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటున్నారు. ఈ క్రమంలోనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన మంచు లక్ష్మి నిత్యం యూట్యూబ్ ఛానల్ ద్వారా నిత్యం ఎన్నో వీడియోలను అభిమానులతో పంచుకుంటారు.
ఈ క్రమంలోనే ఇప్పటికే తను తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నో రకాల హోమ్ టూర్స్ చేశారు. ఈ క్రమంలోనే ఇదివరకే హైదరాబాదులో మోహన్ బాబు ఇంటిని హోమ్ టూర్ చేసిన మంచు లక్ష్మి తాజాగా తిరుపతిలో ఉన్న ఇంటిని హోమ్ టూర్ చేశారు.ఈ క్రమంలోనే ఈ వీడియోని తన యూట్యూబ్ ఛానల్ ద్వారా షేర్ చేయడంతో క్షణాల్లో వైరల్ గా మారింది.
ఇక తిరుపతి ఇల్లు తన తండ్రికి ఎంతో ప్రత్యేకమని మంచు లక్ష్మి తెలియజేశారు. ఎంతో విశాలంగా ఆహ్లాదకరంగా ఉన్న ఇంటిలో మోహన్ బాబు ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయని లక్ష్మీ ప్రసన్న ఈ వీడియో ద్వారా తెలిపారు.
ముఖ్యంగా ఈ ఇంటిలో రోజ్ వుడ్ తో తయారు చేసిన ఎన్నో వస్తువులను చూపించారు. అలాగే పెద్ద రాయుడు సినిమాలో మోహన్ బాబు నిత్యం కూర్చుని ఊగే ఉయ్యాలని కూడా మంచు లక్ష్మి ఈ వీడియో ద్వారా చూపించారు. అది తన తండ్రి ఫేవరేట్ అని చెన్నై ఇంటి నుంచి తిరుపతి తెచ్చుకున్నారని ఈ వీడియో ద్వారా తెలిపారు. అలాగే అందరి గదులు, కిచెన్ అన్నింటినీ ఈ వీడియో ద్వారా లక్ష్మీప్రసన్న అభిమానులతో పంచుకున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఆ అందమైన ఇంద్ర భవనం పై మీరు ఓ లుక్కేయండి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…