కరోనాను జయించేందుకు 13 మెట్లు.. సోషల్ మీడియాలో వైరల్!

ప్రస్తుతం కరోనా పరిస్థితులు ప్రతి ఒక్కరిని ఎంతో భయాందోళనకు గురిచేస్తున్నాయి. కరోనా పాజిటివ్ అనగానే ప్రతి ఒక్కరూ ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకోవాలని భావిస్తుంటారు. అయితే కరోనా సోకిన ప్రతి ఒక్కరికి ఆస్పత్రిలో చికిత్స ఏమాత్రం అవసరం లేదు. ఇంట్లో ఉంటూనే కొన్ని నియమాలను పాటించడం ద్వారా కరోనా నుంచి బయటపడవచ్చు. కరోనా నుంచి కోలుకొని బయటపడాలంటే తప్పనిసరిగా ఈ 13 మెట్లు పాటించాల్సిన అవసరం ఎంతో ఉంది. కరోనాను జయించిన డానికి 13 సోపానాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..

  1. కరోనా లక్షణాలు కనబడిన మొదటి రోజే హోమ్ ఐసోలేషన్ లోకి వెళ్లడం.
  2. స్వల్ప లక్షణాలు కనిపించిన మొదటి రోజే డాక్టర్ పర్యవేక్షణలో ఉండి అతని సూచనలు పాటించడం.
  3. కరోనా లక్షణం కనపడిన రెండవ రోజు RTPCR test ఇవ్వండి. దాని రిజల్ట్ గురించి ఆందోళన వద్దు.
  4. లక్షణాలు కనిపించిన అయిదవరోజు రక్త పరీక్షలు, ఎక్స్రే, సిటీ స్కాన్ అవసరం ఉండదు.

5.కరోనా లక్షణాలు తగ్గనప్పటికీ డాక్టర్లు సూచిస్తే తప్ప రక్త పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉండదు.

  1. కరోనా లక్షణాలు కనిపించిన ఐదవ రోజు నుంచి ప్రతి మూడు గంటలకు ఆక్సిజన్ స్థాయిలను పరీక్షించుకోవాలి.మన శరీరంలో 94 శాతం ఆక్సిజన్ ఉంటే భయపడాల్సిన పనిలేదు. 93 ఉండి శ్వాసకు ఇబ్బంది లేకపోతే ఆందోళన చెందవలసిన అవసరం లేదు. 90 నుంచి 93 మధ్య ఉంటే ఈ విషయాన్ని డాక్టర్ కి తెలియజేసి సరైన సూచనలు తీసుకోవాలి.
  2. అవసరమైతే ఎక్స్రే 6 నుంచి 10 రోజుల మధ్యలో డాక్టర్ సూచిస్తే చేయించుకోవాలి.

8.లక్షణాలు కనిపించిన ఐదవ రోజు నుంచి పదవ రోజు వరకు జ్వరం తీవ్రత తగ్గకుండా అధికంగా ఉంటే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి.

9.ఆక్సిజన్ శాతం 90 నుంచి 93 మధ్య ఉంటే ఆక్సిజన్ స్థాయిలు పడిపోతున్నాయని కంగారు పడటం వల్ల ఆక్సిజన్ స్థాయిలో మరింత పడిపోయి ప్రమాదానికి దారి తీస్తాయి.

10.93 శాతం కన్నా ఆక్సిజన్ స్థాయి తక్కువగా ఉండటం ప్రతి పది మందిలో ఒకరికి జరుగుతుంది కాబట్టి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

11.హోం ఐసోలేషన్లో సరిగా తినని వాళ్ళు కరోనా నుండి కోలుకోవడాని చాలా సమయం పడుతోంది. కనుక ప్రతి మూడు గంటలకు ఒకసారి ఎంతో కొంత తినడం ముఖ్యం. షుగరు జబ్బు ఉన్నవారు తగినంత ఆహారం తీసుకుంటూ ఇంట్లో రెండు పూటలా షుగర్ టెస్టు చేయించుకుంటూ మందులను ఉపయోగించాలి.

  1. కరోనా లక్షణాలు కనిపిస్తూ హోం ఐసోలేషన్ లో ఉన్నపుడు వీలైనంత పడుకోవడమూ అవసరం. అనవసర శక్తి ప్రదర్శన వ్యాయామాలు చేస్తూ తాము బాగానే ఉన్నామని అనుకోకూడదు ఈ సమయంలో విశ్రాంతి ఎంతో అవసరం.

13.హోం ఐసోలేషన్ లో ఉంటూ కరోనాకు సంబంధించి భయం గొలిపే వార్తలను చూడకూడదు. ఈ సమయంలో మన మనసుకు ప్రశాంతత కల్పించే సంగీతం వినడం సినిమాలు చూడటం వంటివి, యోగ చేయడం వంటివి చేయాలి.

పై తెలిపిన 13 సూత్రాలను పాటించడం ద్వారా కరోనా బారిన పడిన వారు ఎటువంటి భయాందోళనలు లేకుండా తొందరగా వ్యాధి నుంచి బయట పడవచ్చు.