Getup Srinu: గెటప్ శ్రీనుకి లిప్ లాక్ ఇచ్చిన హీరోయిన్.. వైరల్ అవుతున్న వీడియో!

Getup Srinu: బుల్లితెర కమెడియన్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న వారిలో గెటప్ శ్రీను ఒకరు. ఈయన జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక ఈ షో ద్వారా వచ్చిన పాపులారిటీతో ఈయన సినిమా అవకాశాలను కూడా అందుకున్నారు.ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈయన ప్రస్తుతం ప్రధాన పాత్రలలో నటించే అవకాశాన్ని అందుకున్నారు.

ఇప్పటికే ఎంతోమంది బుల్లితెర యాంకర్లు కమెడియన్స్ సినిమాలలో ప్రధాన పాత్రలలో నటిస్తూ సందడి చేయడం తాజాగా గెటప్ శ్రీను కూడా రాజు యాదవ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా గత ఏడాది షూటింగ్ ప్రారంభంకాగా త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది.

రాజు యాదవ్ సినిమాలు గెటప్ శ్రీను ఒక బస్తి కుర్రాడు రాజు పాత్రలో నటిస్తున్నారు.ఇక ఈ సినిమా త్వరలోనే విడుదల కానున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చిత్ర బృందం సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సినిమా నుంచి టీజర్ విడుదల చేశారు.

Getup Srinu: మొదటి సినిమాలోని లిప్ లాక్ పెట్టిన శ్రీను…

ఈ టీజర్ ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈ టీజర్ చివరిలో హీరోయిన్ అంకిత హీరోకు లిప్ లాక్ ఇచ్చింది. ఇలా గెటప్ శ్రీను మొదటి సినిమాతోనే లిప్ లాక్ సన్నివేశాలలో నటించడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ప్రస్తుతం రాజు యాదవ్ సినిమా టీజర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.