ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త.. కీలక నిర్ణయం తీసుకున్న సజ్జనార్

ప్రయాణికులను ఆకట్టుకునేందుకు ఆర్టీసీ అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తోంది. టీఎస్ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి వీసీ సజ్జనార్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే అతడు సోషల్ మీడియాలో రిక్వెస్ట్ చేసిన ప్రతీ విషయంలో అతడు సానుకూలంగా స్పందిస్తూ మందుకు సాగుతున్నారు.

బస్టాండ్లలోని దుకాణాల్లోని ధరలపై కూడా దృష్టి సారించింది ఆర్టీసీ. ఎంజీబీఎస్‌లో 90కి పైగా స్టాల్స్‌ ఉండగా.. ప్రస్తుతం 65 మాత్రమే నడుస్తున్నాయి. పండగ నేపథ్యంలో రద్దీ పెరగడంతో కొంతమంది ఎంఆర్‌పీ కంటే అధిక ధరలకు వస్తువులు విక్రయించారు. దీనిపై ఎక్కువగా ఫిర్యాదులు అందడంతో ప్రయాణికుల్లా వస్తువులు కొనుగోలు చేశారు.

దీంతో అతడికి విషయం అర్థం అయింది. దీంతో అటువంటి స్టాల్ కు రూ. వెయ్యి జరిమానాతో పాటు నోటీసులు కూడా జారీ చేశారు. అంతే కాకుండా తాజాగా అతడు ప్రయాణికుల సౌకర్యార్థం మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అందేంటంటే.. టికెట్ కొనే సమయంలో ఆన్ లైన్ పేమెంట్స్ ను యాక్సెప్ట్ చేసేందుకు సిద్ధమైంది. నెటిజన్ల సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం డిజిటల్ పేమెంట్లు ఎక్కువగా జరగుతున్న నేపథ్యంలో ఇదే పద్ధతిని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దీనికి మొదట ఎంజీబీఎస్, రెతిఫైల్ బస్ స్టేషన్ వద్ద బస్ పాస్ కౌంటర్లలో తీసుకొచ్చామని ఓ ప్రకటనలో పేర్కొన్నాడు. ప్రయాణికులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.