గూగుల్ పే కస్టమర్లకు షాకింగ్ న్యూస్…?

దేశంలో ఎక్కువ సంఖ్యలో వినియోగదారులు డిజిటల్ లావాదేవీల కోసం వినియోగించే గూగుల్ పే యాప్ కస్టమర్లకు వరుస షాకులు ఇచ్చేందుకు సిద్ధమైంది. గూగుల్ పే తాజాగా చేసిన కొన్ని ప్రకటనలు యాప్ యూజర్లకు నష్టం కలిగించేవిగా ఉన్నాయి. వచ్చే ఏడాది నుంచి గూగుల్ పే వెబ్ యాప్ సేవలు నిలిచిపోనున్నాయి. గూగుల్ పే భవిష్యత్తులో నగదు బదిలీ జరగాలంటే కూడా చార్జీలు విధించే అవకాశం ఉందని సమాచారం. ఈ నిర్ణయాలు అమలులోకి వస్తే మాత్రం గూగుల్ పే యాప్ కస్టమర్లు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంటుంది.

గూగుల్ పే మీడియా నివేదికల ద్వారా నగదు బదిలీకు ఛార్జీలను వసూలు చేయనున్నట్టు సంకేతాలు ఇచ్చింది. అయితే నగదు బదిలీ చార్జీలకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. గూగుల్ పే వెబ్ అప్లికేషన్ లో పీర్ 2 పీర్ సేవలు 2021 నుంచి జనవరి నుంచి నిలిచిపోనున్నాయి. గూగుల్ పే కస్టమర్లకు ప్రస్తుతం పే.గూగుల్.కామ్ ద్వారా లావాదేవీలు జరుపుకోవడానికి అవకాశమిస్తున్న సంగతి తెలిసిందే.

గూగుల్ పే నోటీసులో వెబ్ యాప్ సేవల నిలిపివేతకు సంబంధించిన విషయాలను పేర్కొంది. అయితే వెబ్ యాప్ సేవలు నిలిచిపోయినా మొబైల్ లో గూగుల్ పే యాప్ వినియోగించే కస్టమర్లకు ఎలాంటి ఇబ్బందులు ఉండవనే చెప్పాలి. కొన్ని రోజుల క్రితం గూగుల్ పే యాప్ లో కస్టమర్ల కోసం కొత్తకొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. మొదట ప్రయోగాత్మకంగా అమెరికాలోని గూగుల్ పే కస్టమర్లకు కొత్త ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి.

అయితే భవిష్యత్తులో మన దేశంలోని కస్టమర్లకు సైతం గూగుల్ పే కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది. గూగుల్ పే నగదు లావాదేవీలకు ఛార్జీలను వసూలు చేస్తే మాత్రం యాప్ వినియోగించే కస్టమర్ల సంఖ్య తగ్గే అవకాశం ఉంది.