Roja Daughter Anshu : చిన్న వయసులోనే పెద్ద పనులు చేస్తున్న రోజా కూతురు …. అమ్మగా మారి పిల్లల బాధ్యత తీసుకున్న అన్షు…!

Great works from Heroien Roja daughter Anshu : తెలుగు హీరోయిన్ గా రోజా ఎన్నో చిత్రాల్లో నటించి గొప్ప పేరు సాధించింది. ఇక రాజకీయాల్లో అడుగుపెట్టి ఎక్కడ తనదైన ముద్ర వేసుకుంది. రెండు సార్లు నగరి నుండి ఎమ్మెల్యే గా గెలుపొంది ఇటీవలే మంత్రిగా పదవి భాద్యతలు తీసుకున్నారు. ఇక రోజా సినిమాలు, రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్న కుటుంబంకు అంతే ప్రాముఖ్యత ఇచ్చారు.ఇక తన కూతురు అన్షు చిన్న వయసులోనే గొప్ప పనులు చేస్తూ రోజా కు మంచి పేరు తెస్తోంది.

Roja Daughter Anshu : చిన్న వయసులోనే పెద్ద పనులు చేస్తున్న రోజా కూతురు …. అమ్మగా మారి పిల్లల బాధ్యత తీసుకున్న అన్షు…!

అమ్మగా పిల్లల భాద్యత…

చీస్ ఫౌండేషన్ ద్వారా ఐదుగురు అనాధ పిల్లలను దత్తత తీసుకొని ఆ పిల్లల బాధ్యతలను తానే స్వయంగా చూసుకుంటూ అమ్మగా మారింది అన్షు. ఇక అన్షు మాలిక అత్యంత చిన్న వయసులోనే వెబ్ డెవలపర్ గా, కంటెంట్ క్రియేటర్ గా, రైటర్ గా, సోషల్ వర్కర్ గా అన్ని రంగాల్లో ప్రతిభ కనబరుస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తోంది.ఇక ప్రతిభ ఉండి కోడింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్నవాళ్లకు.. అది ఎలా నేర్చుకోవాలో తెలియక దిశానిర్దేశం చేసేవారు లేక ఆగిపోయిన పిల్లల కోసం ట్రాన్స్ ఫార్మింగ్ లైఫ్ విత్ కోడింగ్ అనే పేరుతో ఒక స్కూల్ క్లబ్ కూడా స్టార్ట్ చేసింది. అంతే కాకుండా ఇంటి వద్దే భవన కార్మికుల పిల్లలకు ఉచితంగా ట్యూషన్స్ చెప్పేది.

ఇదంతా కేవలం తాను 12-13 ఏళ్ల వయసులో చేసేది. స్కూల్. నుండి ఇంటికి వచ్చాక ట్యూషన్స్ చెప్పేది.ఇక స్మైల్ హండ్రెడ్ ఫౌండేషన్ ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 100మంది పిల్లలను ఎంపిక చేసి విదేశాల్లో చదివించడానికి సహాయం చేస్తోంది.ఇక అన్షుమాలిక చిన్న వయసులోనే ఎలా సామాజిక సేవ పనులు చేస్తూ తన కుటుంబానికి మంచి పేరు తెస్తోంది. మరియు నేటి యువతరానికి ఆదర్శంగా నిలుస్తోంది.