KGF2 Second Day Collections: కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమా కోసం యావత్ సౌత్ ప్రేక్షకులతో పాటు బాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా చూసిన వెయిటింగ్ కి తెరపడింది. ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన, ఈ సినిమాను చూసేందుకు ఆడియెన్స్ ఎంతో ఆసక్తిని కనబరుస్తున్నారు.
ప్రీమియర్ షోతోనే బ్లాక్‌బస్టర్ టాక్ రావడంతో ఈ సినిమా వసూళ్ల పరంగా కూడా అదరగొట్టడం ఖాయమని చిత్ర వర్గాలు ముందు నుంచే అంచనా వేశాయి. అందుకు తగ్గట్టుగానే బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టిస్తుంది కేజీఎఫ్ 2.
మొదటి రోజే రూ.134.5 కోట్ల కలెక్షన్లను రాబట్టి రికార్డు సృష్టించిన ఈ చిత్రం, రెండో రోజూ అదేస్థాయిలో వసూళ్లను రాబట్టినట్లు తెలుస్తోంది. రెండు రోజులకు గాను ఈ చిత్రం దాదాపు 240 కోట్ల రూపాయలను వసూలు చేసి రికార్డు సృష్టించినట్టు సమాచారం. ఇక టాలీవుడ్ విషయానికొస్తే తొలిరోజు రూ.19.5 కోట్ల షేర్ సాధించగా, రెండో రోజు రూ.12.95 కోట్లను రాబట్టింది.రెండో రోజుల్లోనే ఓ డబ్బింగ్ మూవీ టాలీవుడ్‌లో రూ.33 కోట్ల షేర్ రాబట్టడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. గతంలో ఈ రికార్డు రజనీకాంత్ ‘రోబో’ సినిమా సొంతం చేసుకోగా, ఇప్పుడు ఈ జాబితాలోకి కేజీఎఫ్ వచ్చి చేరింది.
ఇక బాలీవుడ్‌లోనూ కేజీఎఫ్ తన సత్తా కొనసాగిస్తోంది. తొలి రోజే రూ.50 కోట్లు వసూళ్లు చేసి మరో రికార్డ్ ను బ్రేక్ చేసింది. రెండో రోజు దాదాపు 45 కోట్లను రాబట్టినట్లు ట్రేడ్ వర్గాల అంచనా. ఇకపోతే కేవలం రెండు రోజుల్లోనే హిందీలో ఈ చిత్రం 100 కోట్ల క్లబ్‌లో చేరడం మరో విశేషం. ఇక వీకెండ్ కూడా దానికి తోడు కావడంతో ఈ సినిమా వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని సీనీ వర్గాల సమాచారం. రెండు రోజులకే కోట్ల రూపాయలు వసూలు చేసిన ఈ సినిమా, వారం ముగిసేసరికి ఎన్ని వందల కోట్లను కలెక్ట్ చేస్తుందో చూడాలి మరి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…