Bigg Boss Telugu OTT: పుట్టిన రెండు రోజులకే అన్నయ్య చనిపోయాడు....ఎమోషనల్ అయిన అనిల్!
Bigg Boss Telugu OTT: బుల్లితెరపై 24 గంటల పాటు ఎంటర్టైన్మెంట్ అందిస్తున్న మెగా షో బిగ్ బాస్ తెలుగులో ప్రారంభం అయిన విషయం తెలిసిందే. ఇప్పటికే హిందీ ఓటీటీలో ఈ షో సక్సెస్ అవడంతో తెలుగులోనూ స్టార్ట్ చేశారు. బిగ్ బాస్ నిర్వాహకులు. ఇక రోజూ ఆ ఇంటి సభ్యులు చేసే సందడితో, గొడవలతో ఇల్లంతా కోలాహలంగా ఉంది. కాగా 17 మందితో స్టార్ట్ అయిన ఈ షోలో ప్రస్తుతం 11 మంది ఉన్నారు.
అయితే వారం ఆరంభంలో ఇంటి సభ్యుల నామినేషన్ ప్రక్రియతో పాటు, అప్పుడప్పుడు బిగ్ బాస్ ఇచ్చే వినూత్న టాస్క్ లు అభిమానులను అలరిస్తున్నాయి. అందులో భాగంగా ఈ వారం బిగ్ బాస్, కంటెస్టంట్స్ కి ఇచ్చిన ప్రక్రియ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండనున్నట్టు తెలుస్తోంది.
తమ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకునే అవకాశాన్ని ఇంటి సభ్యులు సద్వినియోగం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా వారు తమ తమ చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుని ఎమోషనల్ అయ్యారు. అందులో భాగంగా శివ ఒక ఫొటోను చూపిస్తూ, ఈ ఫొటో తర్వాత అమ్మ వాళ్ళతో తాను కలిసి లేనని, అమ్మ తనను ఇంట్లోంచి పంపించేసింది అంటూ బాధ పడ్డాడు.
ఇక ఆ తర్వాత మిత్రా శర్మ కూడా తన చిన్ననాటి ఫొటో చూపిస్తూ, నన్ను పట్టుకున్న చేయి తన అమ్మది, కానీ తన కన్నతల్లిని ఎప్పుడూ చూడలేదు. అమ్మ చేయి మాత్రమే తనకు తెలుసు’ అంటూ వాపోయింది. ఇకపోతే అనిల్ కూడా తన భావాలను పంచుకున్నాడు. తన కంటే ముందు అన్నయ్య ఉండేవాడు, కానీ పుట్టిన రెండు రోజులకే చనిపోయాడు అంటూ ఏడ్చేశాడు. ఇక బిందుమాధవి కూడా తన అన్నయ్యతో దిగిన ఫొటోలు చాలా తక్కువ అని, అతడిని మిస్ అవుతున్నానని చెప్పడం అందరినీ కలచి వేస్తుంది. మొత్తానికి ఈ వారం ఈ షో అంత కొంత ఎమోషనల్ వాతావరణం నెలకొంటున్నట్టు తెలుస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…