Bigg boss Telugu OTT: ఈ వారం బిగ్ బాస్ ను వీడనున్న కంటెస్టెంట్ అతడే… వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వనున్న బాబా మాస్టర్!
Bigg boss Telugu OTT: తెలుగు ఓటీటీ వేదికగా ప్రారంభమైన బిగ్ బాస్ షో ఆసక్తికరంగా సాగుతోంది. కంటెస్టంట్స్ గొడవలు, కామెడీతో దూసుకుపోతున్న ఈ షో ప్రారంభమై ఏడు వారాలైంది. 17 మంది సభ్యులతో స్టార్ట్ అయిన ఈ షోలో ప్రస్తుతం 11 మంది ఉన్నారు. ఇప్పటికే శ్రీరాపాక, చైతు, ముమైత్, తేజస్వీ, సరయు, స్రవంతిలో ఎలిమినేట్ అయ్యారు.
ఈ వారం అనిల్, నటరాజ్, శివ, మిత్రా శర్మ, బిందు మాధవి, అఖిల్, అరియానా, మహేష్ విట్టా, నామినేషన్ లో ఉన్నారు.కాగా ముందు నుంచీ వీరిలో బిందు మాధవి, అఖిల్ భారీ ఓట్లతో ముందంజలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక అరియానా, శివలు కూడా ముందు నుంచే గేమ్ ప్లాన్ ను అమలు చేస్తుండడంతో ఈ ఇద్దరూ కూడా ఎలిమినేట్ అయ్యే అవకాశాలు తక్కువే ఉన్నట్టు సమాచారం.
ఇక ఆ తర్వాత మిత్రా శర్మ ఎప్పుడూ సేఫ్ అయినట్టే ఈ సారి కూడా సేఫ్. ఇక మిగిలింది అనిల్, మహేష్ విట్టా. ఈ ఇద్దరూ గేమ్ పై ఫోకస్ పెట్టి ఆడినా, దానికి తగిన ఫలితం దక్కలేదు. అనిల్ తన పని తాను చేసుకుంటూ ఏమీ పట్టనట్టు ఉండగా, మహేష్ మాత్రం ఇంతకు ముందుతో పోలిస్తే చాలా మెరుగైనట్టు తెలుస్తోంది.షో స్టార్టింగ్ నుంచీ మహేష్, ఇంటి సభ్యులకు గట్టి పోటీ ఇస్తూ తన టాలెంట్ ను నిరూపించుకుంటున్నాడు.
తాజా సమాచారం ప్రకారం మహేష్ విట్టాఎలిమినేట్ అయ్యాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక అతను ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ లేదని, ఎందుకంటే ఓట్ల పరంగా మహేష్ మంచి స్థానంలో ఉన్నాడు కానీ, కావాలనే మహేష్ ను తప్పించాలని చూస్తున్నారని ఆయన అభిమానులు అంటున్నారు. ఇక మరో ముఖ్య విషయం ఏమిటంటే షోలో మరింత ఎంటర్టైన్మెంట్ గా తీర్చిదిద్దేందుకు, ఆసక్తిగా మార్చేందుకు బాబా మాస్టర్ ను వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌజ్ లోకి పంపుతున్నట్లు సమాచారం. ఇప్పటి వరకూ అడపా దడపా నడిచిన ఈ షో, ఇప్పుడు బాబా మాస్టర్ రాకతో మళ్లీ పుంజుకుంటుందా లేదా చూడాలంటే వచ్చే ఎపిసోడ్స్ కోసం ఎదురు చూడాల్సిందే.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…