Gummadi Daughter Sarada: గుమ్మడి భార్య ఆఖరి కోరికను నెరవేర్చిన చిరంజీవి.. ఏం చేశారో తెలుసా?

Gummadi Daughter Sarada: మెగాస్టార్ చిరంజీవి రియల్ లైఫ్ లోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా హీరో అనిపించుకున్న విషయం మనందరికీ తెలిసిందే. ఎంతోమందికి సహాయం చేసి రియల్ లైఫ్ లో కూడా హీరో అనిపించుకున్నాడు మన మెగాస్టార్ చిరంజీవి. తన వద్దకు సహాయం అని వచ్చిన వారికి లేదనకుండా సహాయం చేసిన గొప్ప మనసున్న వ్యక్తి మెగాస్టార్. మెగాస్టార్ కూతురి దగ్గరికి ఒక మహానటుడి కూతురు సహాయం కోసం వెళ్లగా వెంటనే ఆ పని పూర్తయ్యేలా చేశారు మెగాస్టార్ చిరంజీవి.

ఇదే విషయాన్ని సదరు నటుడు కూతురు ఒక ఇంటర్వ్యూలో చెప్పకు వచ్చింది. ఆ నటుడు మరెవరో కాదు సీనియర్ నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు.
గుమ్మడి వెంకటేశ్వరరావు గురించి ఈ తరం వారికి అంతగా తెలియకపోవచ్చు కానీ ఆ తరం వారు ఇట్టే గుర్తుపట్టేస్తారు. ఎన్టీఆర్ ఏఎన్నార్ కృష్ణ వంటి స్టార్ హీరోలకు తండ్రిగా మావయ్యగా ఎన్నో సినిమాలలో నటించి మెప్పించాడు గుమ్మడి వెంకటేశ్వరరావు. ఇక గుమ్మడి కూతురు శారద. ఆమె ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో తన తండ్రి గురించి అలాగే మెగాస్టార్ చిరంజీవి తనకు చేసిన సహాయం గురించి చెప్పుకొచ్చింది.

ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో భాగంగా ఆమె మాట్లాడుతూ.. తన ఊరిలో తన తాత ముత్తాతల్లో ఒకరు అప్పట్లో రామాలయం కట్టించారని, అయితే కాలక్రమేణా ఆ గుడి రోడ్డు కంటె కిందకు వెళ్ళిపోయి గుడిలో నీళ్లు చేరి చాలా ఇబ్బందిగా ఉండేదని ఆమె తెలిపింది. ఒకరోజు ఆమె తన ఊరికి వెళ్ళినప్పుడు ఆ గుడిలో ఉన్న ఒక పురోహితుడు నీరు చేరి చాలా ఇబ్బందిగా ఉంది చెప్పినప్పుడు ఆమె ఏదో ఒకటి చేయాలి అనుకుని వెంటనే చిరంజీవిని కలిస్తే పని అయిపోతుందని ఆమె చిరంజీవి దగ్గరికి వెళ్లిందట. ఆ గుడి పైకి తీయాలని మా అమ్మ గారి ఆఖరి కోరిక అని, అది తీరకుండానే తన అమ్మ చనిపోయిందని చిరంజీవికి శారదా తెలిపిందట. ఆమె చెప్పిన అరగంటలో గుడికి సంబంధించిన ఫైల్ కదిలిందని, గుడిని మళ్ళీ కట్టించేలా చిరంజీవి పూనుకున్నారని కొత్తగా గుడి కట్టి ఆరేళ్ళు అవుతుందని గుమ్మడి కూతురు శారద అన్నారు.

Gummadi Daughter Sarada: చిరంజీవి చొరవతోనే…


ఆరేళ్ళ క్రితం అంటే అప్పటికి చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉన్నట్లు ఆమె తెలిపింది. అయితే 2014 నుంచి మెగాస్టార్ రాజకీయాలలో యాక్టివ్ గా లేరని అప్పటికే టూరిజం మినిస్టర్ కూడా లేరని సమయంలో మెగాస్టార్ తన పలుకుబడితో గుడి నిర్మాణ పనులకు కావాల్సిన అనుమతులు తీసుకొచ్చి ఆలయ నిర్మాణం పూర్తయ్యేందుకు తన వంతు సహాయం చేసినట్లు ఆమె చెప్పుకొచ్చింది. రాముల వారి ఆలయం కోసం హనుమంతుని పేరు పెట్టుకున్న చిరంజీవి పూనుకోవాల్సి వచ్చిందనీ చెబుతూ ఆమె ఎమోషనల్ అయ్యింది. ఆలయం పూర్తయిన తర్వాత చిరంజీవి గారిని ఆహ్వానానికి పిలిచాము కానీ ఆయన షూటింగ్లో బిజీగా ఉండడం వల్ల రాలేదు అని చెప్పుకొచ్చింది శారద. తన తల్లి చివరి కోరికను మెగాస్టార్ చిరంజీవి తీర్చినట్లు శారద చెప్పుకొచ్చింది.