Actor Kamal Tumu: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్వయంకృషితో ఎదిగిన హీరోలలో రవితేజ కూడా ఒకరు. మొదట అసిస్టెంట్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రవితేజ ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలలో నటించాడు. ఇలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు రవితేజకి హీరోగా కూడా అవకాశం వచ్చింది. ఆ తర్వాత హీరోగా మారి ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి మాస్ మహారాజగా ఇండస్ట్రీలో తనకంటూ గుర్తింపు ఏర్పరచుకున్నాడు.
ఇలా అసిస్టెంట్ డైరెక్టర్గా మొదలైన తన సినీ ప్రయాణం ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో స్థాయికి చేరింది. హిట్, ప్లాప్ లతో సంబంధం లేకుండా కుర్ర హీరోలకు పోటీగా వరుస సినిమాలలో నటిస్తూ రవితేజ బిజీగా ఉన్నాడు. చాలా కాలంగా రవితేజకు ఒక్క హిట్ కూడా లేదు. ఇటీవల గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకేక్కిన క్రాక్ సినిమా ద్వారా రవితేజ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇక ఇటీవల విడుదలైన ధమాకా సినిమా కూడా మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది.
ఇక తాజాగా తన అభిమాన హీరో చిరంజీవితో కలిసి వాల్తేరు వీరయ్య సినిమాలో మంచి కీలక పాత్రలో నటించాడు. ఇలా వరుస హిట్లు అందుకొని రవితేజ ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్నాడు. ఇదిలా ఉండగా రవితేజ స్నేహితుడు నటుడు అయిన కమల్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని రవితేజ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఇంటర్వ్యూలో పాల్గొన్న కమల్ మాట్లాడుతూ..” నేను హీరోగా మారినప్పుడు రవితేజ ఇంకా హీరో అవ్వలేదు. అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నారు. రవితేజ ఎంతో కష్టపడి తన స్వయంకృషితో హీరోగా మారాడు.
గతంలో రవితేజ ఎంత ఎనర్జిటిక్ గా ఉండేవాడు ఇప్పటికి అంతే ఎనర్జిటిక్ గా ఉన్నాడు. ఈ వయసులో కూడా ఎంతో ఫిట్ గా ఉంటూ కుర్ర హీరోలకు పోటీగా నిలుస్తున్నాడు. ముక్కు సూటిగా మాట్లాడే తత్వం ఉన్న రవితేజ అందరితో మంచిగా ఉంటే ఇప్పటివరకు ఎటువంటి కాంట్రవర్సీలోనూ నిలవలేదు. హైదరాబాద్ వచ్చిన కొత్తలో కుటుంబం కోసం త్రీ బెడ్ రూమ్ ఫ్లాట్ ఉంటే చాలు అనుకున్న రవితేజ ఇప్పుడు ఇదే హైదరాబాదులో 12 కోట్ల రూపాయల విలువచేసే ఇంట్లో ఉంటున్నాడు. తన స్వయంకృషితో ఈరోజు ఇంత గొప్ప స్థాయికి ఎదిగాడు “అంటూ రవితేజ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…