Featured

Chaithanya Krishna : కోమాలో ఉన్న తారక రత్న… ఎక్మో చికిత్స చేయడం లేదు…: చైతన్య కృష్ణ

Chaitanya Krishna : ఎన్టీఆర్ నట వారసుడిగా తెలుగు సినిమాకు పరిచయమైన ఎన్టీఆర్ కుమారుడు మోహన కృష్ణ తనయుడు తారక రత్న ఒకేసారి తొమ్మిది సినిమాలను ఒప్పుకుని అప్పట్లో రికార్డు సృష్టించాడు. అయితే మొదటి సినిమా ‘ఒకటో నెంబర్ కుర్రాడు’ పర్వాలేదనిపించినా మిగిలిన సినిమాలు ఎపుడు వచ్చాయో ఎపుడు పోయాయో కూడా తెలియకుండా వెళ్లిపోయాయి. ఇక సినిమాలను తగ్గించిన తారక రత్న మధ్యలో ఒకసారి రవిబాబు సినిమా ‘అమరావతి’లో విలన్ పాత్రలో అదరగొట్టాడు. ఇక మళ్ళీ చాలా రోజులకు వెబ్ సిరీస్ తో అలరించిన తారక రత్న ఈసారి సినిమాతో కాదు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి స్పీచులతో ఆకట్టుకున్నాడు. అయితే కుప్పంలో తాజాగా లోకేష్ తో కలిసి పద యాత్రలో కలిసి వెళ్తోండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే బెంగళూరు తరలించగా గుండె పనిచేయడం ఆగిపోవడంతో ఎక్మో ద్వారా చికిత్స అందిస్తున్నట్ల బయటకు వినిపిస్తున్నా అసలు జరుగుతున్నది ఏమిటి, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి మీద క్లారిటీ ఇచ్చారు చైతన్య కృష్ణ.

ఎక్మో చికిత్స చేయడం లేదు… ఇపుడే చెప్పలేము…

తారక రత్న తాజాగా కుప్పంలో లోకేష్ పాదయాత్రలో పాల్గొని అక్కడే సొమ్మసిల్లి పడిపోయారు. ఆ తరువాత అక్కడి నుండి బెంగళూరు నారాయణ హృదయాలయకి చికిత్స నిమిత్తం తరలించారు. అక్కడ ఆయన గుండె పనిచేయడం లేదని ఎక్మో ద్వారా చికిత్స అందిస్తున్నారంటూ వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో అసలు తారక రత్న పరిస్థితి ఎలా ఉందనే విషయం గురించి ఆయన సోదరుడు చైతన్య కృష్ణ క్లారిటీ ఇచ్చాడు.

ఎక్మో ద్వారా చికిత్స అందించడం లేదని, కేవలం యాంజియోగ్రామ్ చేసారని అయితే ప్రస్తుతం తారక రత్న కోమాలో ఉన్నట్లు తెలిపారు. ఆయన పరిస్థితి ఇంకా సీరియస్ గానే ఉన్నా కోలుకుంటారనే నమ్మకం ఉందని తెలిపారు. సోమవారం వరకు పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేమని వైద్యులు తెలిపినట్లు వివరించారు. ఆయన త్వరగా కోలుకోవాలని తిరిగివస్తారనే నమ్మకం ఉందంటూ ఆశాభావం వ్యక్తం చేసారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago