Tarakaratna Family: నందమూరి కుటుంబానికి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న పేరు ప్రఖ్యాతల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నందమూరి తారక రామారావు వారసులుగా ఎంతోమంది ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. అయితే వారిలో కొంతమంది మాత్రమే హీరోలుగా మంచి గుర్తింపు పొందారు. ఇలా నందమూరి కుటుంబం నుండి హీరోగా అడుగుపెట్టిన వారిలో నందమూరి తారకరత్న కూడా ఒకరు. 2002 వ సంవత్సరంలో ‘ఒకటో నెంబర్ కుర్రాడు’ సినిమా ద్వారా ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.
ఆ తర్వాత హీరోగా పలు సినిమాల్లో నటించాడు. అయితే తారకరత్న హీరోగా సక్సెస్ కాలేకపోయాడు.
దీంతో ఆ తర్వాత విలన్ గా కూడా అమరావతి, రాజా చెయ్యి వేస్తే వంటి సినిమాలలో నటించాడు. అయితే విలన్ గా కూడా సరైన గుర్తింపు లభించకపోవడంతో సినిమా ఇండస్ట్రీకి దూరం అయ్యాడు. ఆ తర్వాత పూర్తిగా ఇండస్ట్రీకి దూరమైన తారకరత్న బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టాడు. ఇదిలా ఉండగా తారకరత్న
అలేఖ్య రెడ్డి అనే యువ తిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు వీరికి ఒక కూతురు.
చాలాకాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న తారకరత్న సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా కనిపించడం లేదు. అయితే ఇటీవల నారా లోకేష్ ప్రారంభించిన ఇవ్వగలం పాదయాత్రలో పాల్గొని గుండెపోటు రావడం వల్ల అనారోగ్యం పాలయ్యాడు. ఇలా గుండెపోటు రావడం వల్ల గృహ కోల్పోయిన తారకరత్న అని మొదట కుప్పంలోని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం తారకరత్న బెంగళూరులో చికిత్స పొందుతున్నాడు. తారకరత్న కుటుంబ సభ్యులందరూ అతన్ని పరామర్శించడానికి బెంగళూరుకు చేరుకున్నారు. అయితే ప్రస్తుతం తారకరత్న పరిస్థితి విషమంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో తారకరత్న తొందరగా కోలుకోవాలని నందమూరి అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం నందమూరి తారకరత్న కుటుంబానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తమిళనాడు రాజకీయాలు మరోసారి తీవ్ర వేడిని సంతరించుకున్నాయి. అధికార పక్షం, ప్రతిపక్షం మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు రోజురోజుకూ ముదురుతున్న…
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం, వాటి పరస్పర దృష్టులు మనిషి జీవితంపై ప్రభావం చూపుతాయని విశ్వసిస్తారు. గ్రహాల ప్రత్యేక కలయికల…
బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకునే వారికి భారీ ఊరట లభించింది. గత కొన్ని వారాలుగా క్రమంగా తగ్గుతూ వస్తున్న పసిడి…
భారతీయుల ఆహారపు అలవాట్లలో పెరుగుకు ప్రత్యేక స్థానం ఉంది. భోజనం చివరలో ఒక గిన్నె పెరుగు తింటే కడుపుకు హాయిగా…
ప్రపంచవ్యాప్తంగా బంగారానికి ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సంపదకు, శుభానికి, భద్రమైన పెట్టుబడికి ప్రతీకగా భావించే…
దక్షిణ భారత సినీ పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన నటీమణుల్లో సమంత ఒకరు. తన నటన, కష్టపడి పనిచేసే తత్వం,…