HDFC Bank : అన్ని బ్యాంకులను తొక్కి HDFC బ్యాంకు నెంబర్ వన్ ఎలా అయింది..!?

HDFC Bank : మనం డబ్బు దాచుకోవాలన్నా ఋణం తీసుకోవాలన్నా ఇపుడైతే క్రెడిట్ కార్డు అంటూ నెల వస్తే అప్పు తీసుకోవాలన్నా మనం ఆధారపడేది బ్యాంకు మీదే. అలాంటి బ్యాంకులలో ప్రైవేట్ బ్యాంకులలో ఎంతో మంది కస్టమర్ల నమ్మకాన్ని పొంది బ్యాంకింగ్ లో ముందంజలో ఉన్న బ్యాంకు HDFC. ఐసీఐసీఐ బ్యాంకు ను దాటేసుకుని ముందంజలోకి HDFC బ్యాంకు ఎలా వచ్చింది, హోసింగ్ లోన్స్ ఇచ్చే కార్పొరేషన్ గా నలభై ఏళ్ల క్రితం మొదలయిన ఈ సంస్థ ఇపుడు బ్యాంకింగ్ లో నెంబర్ వన్ స్థానానికి ఎదగాడానికి కారణం ఆ సంస్థ ఫౌండర్ హస్ముఖ్ భాయ్ పరేఖ్.

నెంబర్ వన్ గా ఎలా నిలిచింది…

ఐసీఐసీఐ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న హస్ముఖ్ భాయ్ పరేఖ్ గారు ఒక ఆశయంతో HDFC బ్యాంకును స్థాపించడం జరిగింది. అదే బ్యాంకు నేడు ఐసీఐసీఐ ను నెట్టి ముందు వరుసలో నిలబడటం విశేషం. హస్ముఖ్ భాయ్ పరేఖ్ గారు ఐసీఐసీఐ బ్యాంకులో రిటైర్ అయ్యాక ప్రతి భారతీయుడికి సొంత ఇల్లు ఉండాలి అనే ఉద్దేశంతో HDFC బ్యాంకును మొదట హోసింగ్ డెవలప్మెంట్ సంస్థగా ప్రారంభించారు. అలా అంచెలంచెలుగా ఎదుగుతూ దేశవ్యాప్తంగా తన బ్రాంచులను విస్తరించింది ఈ బ్యాంకు. HDFC బ్యాంకు ఎదగడానికి మూల కారణం కో ఆపరేటివ్ బ్యాంకులో ఉన్న ఒక లోపం.

ప్రతి రాష్ట్రంలోనూ కో ఆపరేటివ్ బ్యాంకులు ఉన్నా ఒక చోట తీసుకున్న చెక్ ను మరో రాష్ట్రంలో క్యాష్ చేయాలంటే కనీసం 4 రోజులు సమయం పట్టేది. ఈ లోపాన్ని గమనించి ఆ చెక్ లను తమ బ్యాంకులో డిపాజిట్ చేస్తే వెంటనే డబ్బు ఇచ్చేలా HDFC బ్యాంకు సదుపాయం కల్పించింది. అలాగే ఏమాత్రం ఛార్జి చేయకుండా డబ్బు ఇచ్చే వెసులుబాటు కల్పించింది. అయితే ఇందుకు కోఆపరేటివ్ బ్యాంకులు కస్టమర్ల డిపాజిట్ లో కొంత మొత్తాన్ని తమ బ్యాంకులో డిపాజిట్ చేసేలా ఒప్పందం చేసుకున్నాయి. అలా మొదలైన ప్రయాణంలో ఉద్యోగస్థుల జీతాలను కూడా తమ అకౌంట్స్ కి క్రెడిట్ చేసే పద్దతిని ప్రవేశ పెట్టింది HDFC బ్యాంకు. ఇక అలా నెమ్మదిగా భారతీయుల నమ్మకం పెంచుకున్న ఈ బ్యాంకు ఇపుడు ఆన్లైన్ కొనుగోలులో కూడా అన్ని బ్యాంకుల కంటే ఎక్కువ డిస్కౌంట్స్ అలాగే క్యాష్ బాక్స్ ఇస్తూ లీడింగ్ బ్యాంకుగా ఉంది.