Shriya: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అగ్ర తారక ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న శ్రేయ ఒకానొక సమయంలో ఇండస్ట్రీలోనే స్టార్ హీరోలు అందరి సరసన నటించి మెప్పించారు.అలాగే సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన అనంతరం ఈమె వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇలా తన కథకు ప్రాధాన్యత ఉన్న పాత్రలలో నటిస్తూ శ్రేయ ఎంత బిజీగా గడుపుతున్నారు.
ఇకపోతే తాజాగా ఈమె చిరంజీవి సినిమాలో నటించే అవకాశాన్ని అందుకున్నారని తెలుస్తుంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో రాబోతున్న భోళా శంకర్ సినిమాలో శ్రేయ నటించబోతున్నట్లు సమాచారం.ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా తమన్నా నటిస్తున్నారు. అలాగే చిరంజీవికి చెల్లెలి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులు జరుపుకుంటుంది. ఇకపోతే ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ఉండబోతుందని ఈ పాటలో సీనియర్ నటి శ్రేయ నటించబోతున్నారని తెలుస్తోంది.ఇక ఈ పాటలో ఈమె నటించడం కోసం ఏకంగా కోటి రూపాయల రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లు సమాచారం.ఇలా భారీ స్థాయిలో శ్రేయ డిమాండ్ చేయడంతో మేకర్స్ కూడా ఇవ్వడానికి సిద్ధమయ్యారట.
సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన కూడా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి శ్రేయ ఇలా ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడం అంటే మామూలు విషయం కాదు.అయితే ఈమెకు భారీ స్థాయిలో ఆదరణ ఉండటం వల్లే ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ డిమాండ్ చేశారని ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకున్న మేకర్స్ ఈమె అడిగినది ఇవ్వడానికి సానుకూలంగా ఉన్నారని తెలుస్తోంది.ఇక చిరంజీవి శ్రేయ ఇదివరకే ఠాగూర్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలో జంటగా నటించిన విషయం మనకు తెలిసిందే.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…