Akhil: అఖిల్ అక్కినేని తాజాగా ఏజెంట్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఎన్నో అంచనాల నడుమ తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 28వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది.సురేందర్ రెడ్డి దర్శకత్వంలో భారీ యాక్షన్ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాలవల్ల వాయిదా పడుతూ వచ్చింది.
ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఇంటర్వ్యూలకు హాజరవుతూ పెద్ద ఎత్తున సినిమాని ప్రమోట్ చేస్తున్నారు.ఈ ప్రమోషన్లలో భాగంగా తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేసిన విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇకపోతే ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్ లో సంచలనాలను సృష్టిస్తుంది. ఈ క్రమంలోనే ఈ ట్రైలర్ విడుదలైన 24 గంటలలో 12 మిలియన్ కైవసం చేసుకుని బాలయ్య వీర సింహారెడ్డి ట్రైలర్ వ్యూస్ రికార్డును బద్దలు కొట్టిందని చెప్పాలి.బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమా ద్వారా ఈ ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విషయం మనకు తెలిసిందే.
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకుంది.ఈ క్రమంలోనే ఈ సినిమా నుంచి గతంలో ట్రైలర్ విడుదల కాగా 24 గంటల్లో యూట్యూబ్ లో 10 మిలియన్ వ్యూస్ కైవసం చేసుకుంది.అయితే ఈ రికార్డును అఖిల్ ఏజెంట్ ట్రైలర్ బద్దలు కొడుతూ 24 గంటలలో 12 మిలియన్ వ్యూస్ కైవసం చేసుకోవడంతో సినిమాపై భారీ అంచనాలను పెంచేసాయి. మరి అఖిల్ ఏజెంట్ ద్వారా హిట్ కొట్టబోతున్నారా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…