కడుపు ఉబ్బరంగా ఉందా.. ఈ ఆహార పదర్ధాలను తీసుకోండి..!

కొంతమందికి ఏమీ తినకపోయినా.. కొద్దిగా తిన్నా కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంటుంది. దీనినే బ్లోటింగ్ అని కూడా అంటారు. వీటికి ముఖ్యమైన కారణం ఏంటంటే.. మలబద్దకం, సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం. చక్కెర, పిండి పదార్ధాలు, కాలీఫ్లవర్, క్యాబేజీ, ముల్లంగి వంటి వాటిని తీసుకోవడం వల్ల ఈ సమస్య వస్తుందని నిపుణులు చెబుతున్నారు.

అయితే ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే..కొన్ని ఆహార పదర్థాలు తీసుకోవాలి. అవేంటంటే.. పీచు పదర్థాలను జీర్ణవ్యవస్థ చురుగ్గా పనిచేయాలంటే తీసుకోవాలి. బెర్రీలు, పండ్లు, కూరగాయలు తినాలి. వీటిలో ఎక్కువగా పీచు పదర్థాలు ఉంటాయి. నీటిశాతం ఎక్కువగా ఉండే దోసకాయలు తరచూ తినడం ద్వారా జీర్ణ వ్యవస్థకు అవసరమైన ఎంజైమ్‌లు లభిస్తాయి.

డైజెస్టివ్ ఎంజైమ్‌లు అధికంగా ఉండే ఫైనాపిల్ ప్రోటీన్లు, పిండి పదార్ధాలు తేలిగ్గా అరిగేలా చేస్తాయి. కివి, బొప్పాయి కూడా అజీర్ణ సమస్యలకు చెక్ పెడుతుంది. శరీరంలో సోడియం ఎక్కువగా ఉన్నా కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంటుంది. అయితే అరటి పండు తినడం వల్ల శరీరం నుంచి సోడియంను బయటికి పంపించి కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది.

యాపిల్ సిడార్ వెనిగర్, పసుపు, అల్లం, నిమ్మ, ప్రోబయోటిక్స్ వంటి వాటిని తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం సమస్య తొలగిపోతుంది. వీటిని తీసుకోవడమే కాకుండా తరచూ రోజుకు 4 లీటర్ల నీటిని తాగాలి. ఆహారం తినేటప్పుడు ముఖ్యంగా ఆహారాన్ని నమిలి తినాలి. దీంతో జీర్ణవ్యవస్థ మంచిగా పని చేస్తుంది.అప్పుడే కడుపు ఉబ్బరం సమస్య నుంచి విముక్తి పొందవచ్చు.