వంటింటి చిట్కాలతో షుగర్ లెవల్స్ ను ఇలా కంట్రోల్ చేసుకోండి..

డయాబెటిస్ అనేది దీర్ఘకాలిక వ్యాధి. అటువంటి వ్యాధి ఉన్నవారికి షుగర్ లెవల్స్ అనేవి కంట్రోల్ లో ఉండవు. దాని ద్వారా కూడా అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అయితే వాటిని అదుపులో ఉంచడానికి.. ఇంకా ఇతర వ్యాధులు రాకుండా ఉండటానికి వంటింటి చిట్కాలతో సాధ్యం అవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే.. క్రమం తప్పకుండా కొన్ని మూలికలు, సుగంధ ద్రవ్యాలను తీసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా వంటింట్లో కూరల్లో ఉపయోగించి పసుపులో ఎన్నో యాంటి ఆక్సిడెంట్లు ఉంటాయి.

ఇవి శరీరానికి ఎంతో ఉపయోగపడతాయి. పసుపులోని కర్కుమిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది డయాబెటిస్ రోగులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. దీని ద్వారా షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేయవచ్చు. మరో వంటింటి చిట్కా ఏంటంటే.. మెంతి గింజలు. దీనిని కూడా క్రమం తప్పకుండా తీసుకుంటే.. షుగర్ లెవల్స్ కంట్రోల్ లో ఉంటాయి. మెంతులలో పీచు పదార్ధం సమృద్ధిగా వుంటుంది. అంతేకాకుండా దీనిలో కార్బోహైడ్రేట్లను గ్రహించే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది.

తద్వారా ఇది చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. కడుపు సమస్యలను చాలా వరకు తగ్గించుటకు దాల్చినచెక్క ఎంతో సహాయపడుతుంది. దీనిని ఉబ్బరం, మలబద్ధకం మరియు వికారం నివారణ కోసం ఉపయోగిస్తారు. కడుపు పూతల నివారణకు మరియు ఆకలిని మెరుగుపరచడంలో కూడా దాల్చినచెక్క కూడా సహాయపడుతుంది. ఇది కూడా చక్కెర స్థాయిని తగ్గిస్తుంది. తులసి గింజలు కూడా ఆరోగ్య కారకాలే. వీటిలో తక్కువ క్యాలరీలు, ఎక్కువ పోషకాలు ఉన్నాయి.

డయాబెటిస్ తో బాధపడుతున్న వాళ్లు ప్రతిరోజు తమ ఆహారంలో తులసి ఆకులను భాగంగా చేసుకుంటే బ్లడ్ లోని షుగర్ లేవల్స్ ను తగ్గిస్తుంది. టైప్ 2 డయాబెటిస్ తో బాధపడే వాళ్లలో ఇన్సులిన్ గ్రంథి ఎక్కువ ఉత్పత్తి అయ్యేలా తులసి ఆకులు చేస్తాయి. దీంతో షుగర్ ను కంట్రోల్ చేసుకోవచ్చు. ఇలా పైన చెప్పిన వంటింటి చిట్కాలను వాడి షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేసుకోవచ్చిు.