Shyam Singha Roy: థియేటర్ కంటే.. కిరాణ కొట్టు నయం.. ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడిన నానీ..!

Shyam Singha Roy: థియేటర్ కంటే.. కిరాణ కొట్టు నయం.. ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడిన నానీ..!

Shyam Singha Roy: రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాన్ చేసని వ్యాఖ్యలపై అప్పుడు రచ్చ రచ్చ జరిగిన విషయం తెలిసిందే. అతడు టికెట్ల విషయంలో ఏపీ ప్రభుత్వం ఓ రేంజ్ లో విరుచుకుపడ్డాడు. దానికి సపోర్టుగా నానీ కూడా మాట్లాడటం విశేషం. ఈ వివాదం కారణంగానే టాలీవుడ్ వర్సెస్ ఏపీ ప్రభుత్వం అన్నట్టుగా మారిపోయింది.

Shyam Singha Roy: థియేటర్ కంటే.. కిరాణ కొట్టు నయం.. ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడిన నానీ..!
Shyam Singha Roy: థియేటర్ కంటే.. కిరాణ కొట్టు నయం.. ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడిన నానీ..!

ఇప్పటికే పలుమార్లు టాలీవుడ్ పెద్దలు, కొంతమంది నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు కలిసి టికెట్ ధరలపై ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను రద్దు చేయాలని ప్రభుత్వ పెద్దలను కోరారు. ఏపీ టికెట్ రేట్లపై ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 35పై కొందరు హైకోర్టుకు వెళ్లగా అక్కడ కొంత ఊరట లభించింది. అయినా ప్రభుత్వం సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ డివిజనల్ బెంచిలో అప్పీల్ దాఖలు చేసింది.

Prabhas-Radhe Shyam: రాధేశ్యాం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హోస్ట్ గా యంగ్ హీరో.. ఎవరో తెలుసా..!

ఈ వివాదంపై ఇప్పటికే టాలీవుడ్ కు చెందిన సెలబ్రిటీలు స్పందించి.. వారి వారి వెర్షన్ వినిపించారు. మరో సారి నానీ కూడా తనదైన శైలిలో టికెట్ల వ్యవహారంపై విరుచుకుపడ్డాడు. రేపు నానీ నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమా విడుదల కానున్న సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మీడియా చిట్ చాట్ లో నానీ ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ల ధరల తగ్గింపుపై స్పందించాడు. ప్రభుత్వం టికెట్ ధరలను తగ్గించి ప్రేక్షకులను అవమానించిందని ఆకస్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.

Shyam Singha Roy: థియేటర్ కంటే.. కిరాణ కొట్టు నయం.. ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడిన నానీ..!

థియేటర్ అంటే.. 10 మందికి ఉపాధి కల్పిస్తుంది.. దీని కంటే కూడా థియేటర్ పక్కన కిరాణ కొట్టు పెట్టి అమ్ముకునే వాటికి ఎక్కువగా కలెక్షన్స్ వస్తున్నాయని అన్నాడు. టికెట్ ధరలను పెంచినా.. వాటిని కొని చూసే సామర్థ్యం ప్రేక్షకుల దగ్గర ఉందని అన్నాడు. ప్రభుత్వం కావాలనే వారిని అవమానించే ప్రయత్నం చేస్తుందన్నారు. ప్రస్తుతం తాను ఏది మాట్లాడినా వివాదం అవుతుందని చెబుతూనే.. ఉదాహరణలు చెబుతూ ప్రభుత్వాన్ని విమర్శించాడు.