Faria Abdullah: బంపర్ ఆఫర్ కొట్టేసిన జాతిరత్నాలు హీరోయిన్.. ఏకంగా స్టార్ హీరో సరసన..!
Faria Abdullah: ఇటీవలే ‘జాతి రత్నాలు’తో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఫరియా అబ్దుల్లా.. ఇటీవలే ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’లో అతిథి పాత్రలో నటించింది. మొదటి సినిమాతోనే మంచి ఫేమ్ తెచ్చకున్న ఈ అమ్మడుకు తర్వాత ఆఫర్లు రాలేదనే చెప్పాలి. అఖిల్ హీరోగా.. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లో అవకాశం వచ్చినా అది.. ఆ సినిమాలో ఆమె క్యారెక్ట్ ఫుల్ గా ఉండదు.. కొద్ది సేపు మాత్రమే ఉంటుంది.
ఫుల్ హీరోయిన్ క్యారెక్టర్ గా మాత్రం అవకాశం రాలేదు. దాని తర్వాత ఈ నటి ఇప్పుడు ‘బంగార్రాజు’లో నాగ చైతన్య మరియు నాగార్జునలతో ఒక ప్రత్యేక పాటలో వారితో కలిసి డ్యాన్స్ వేసింది. ఇప్పటికే దీనికి సంబంధించిన పాట ‘వాసివాడి తస్సదియ్యా’ అనే సాంగ్ యూట్యూబ్లో రచ్చ చేస్తోంది.
దీనిలో కూడా కేవలం ఈ ఒక్క పాటలోనే ఆమె కిపిస్తుందనే టాక్ వినిపిస్తోది. దీని తర్వాత ఫరియాకు ఆపర్లు రాలేదు. తాజాగా నాగార్జున సరసన హీరోయిన్ గా ఛాన్స్ వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అతడి తదుపరి చిత్రం ‘ద ఘోస్ట్’ లో హీరోయిన్ గా ఎంపిక అయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. నాగార్జున సరసన ఈ సినిమాలో మొదట కాజల్ అగర్వాల్ అనుకున్నారట.
కానీ వ్యక్తిగత కారణాల వల్ల ఆమె ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. తర్వాత కాజల్ అగర్వాల్ ప్లేస్ లో .. అమాలపాల్, ఇలియానా, మెహ్రీన్ పిర్జాదా వంటి పేర్లు వినిపించాయి. కానీ చివరకు ఆ అవకాశం ఫరియా అబ్దుల్లా (జాతిరత్నాలు ఫేమ్)కు వచ్చినట్లు సమాచారం. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. మేకర్స్ ఇప్పటికే ‘ద ఘోస్ట్’ చిత్రం మొదటి షెడ్యూల్‌లను పూర్తి చేశారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో “ది ఘోస్ట్” అనే సినిమా తెరకెక్కుతోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…