చనిపోయిన వాళ్ళతో పోల్చడం ఏంటి..? కాస్త ఆలోచించి మాట్లాడండి : నటుడు శ్రీకాంత్

శుక్రవారం సాయంత్రం హైదరాబాదులో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే పలువురు సినీ సెలబ్రిటీలు ఆయనను పరామర్శించి ఆయన ఆరోగ్యం కుదుటపడి త్వరగా కోలుకొని క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని ప్రార్థిస్తున్నారు. ఇలాంటి సమయంలో సీనియర్ నటుడు నరేష్ సాయి ధరమ్ తేజ్ ప్రమాదం గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.

యువత కేవలం అతివేగం కారణంగా ఇలాంటి ప్రమాదాలకు గురవుతున్నారు. ఇప్పటికే ఈ విధమైనటువంటి యాక్సిడెంట్స్ వల్ల ఎంతో మంది చనిపోయారు అంటూ మాట్లాడటంతో నటుడు నరేష్ వ్యాఖ్యలను పలువురు సెలబ్రిటీలు తప్పుబడుతున్నారు. ఇప్పటికే ఈ విషయం గురించి బండ్ల గణేష్ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో షేర్ చేస్తూ ఇలాంటి సమయంలో రాజకీయాలు వద్దు..ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఆ పరమేశ్వరుడిని ప్రార్థించి క్షేమంగా బయటకు రావాలని కోరుకోవాలి తప్ప మరణించిన వారి గురించి ప్రస్తావించకూడదని తెలిపారు.

ఈ విధంగా నరేష్ చేసిన వ్యాఖ్యలకు హీరో శ్రీకాంత్ స్పందించారు.. ఈ సందర్భంగా సాయి ధరమ్ రోడ్డు ప్రమాదం గురించి శ్రీకాంత్ మాట్లాడుతూ.. సాయి తేజ్ కు జరిగినది కేవలం చిన్న యాక్సిడెంట్.. ఇది కామన్ గా జరిగేది. రోడ్డుపై ఇసుక ఉండటం వల్ల స్కిడ్ అయ్యి కింద పడిపోవడం జరిగింది. ఈ ప్రమాదం నుంచి ఆయన తొందరగా కోలుకుంటారు.. కోలుకొని సురక్షితంగా బయటపడాలని ఆ భగవంతుని మనస్పూర్తిగా ప్రార్థిస్తున్నాను అంటూ శ్రీకాంత్ తెలియజేసారు.

అదే విధంగా ఎవరైనా వీడియో బైట్లు పెట్టేటప్పుడు కొంచెం ఆలోచించి పెట్టండి. సాయి ధరమ్ తేజ్ ఏంటో నాకు తెలుసు ఆయన ర్యాష్ డ్రైవింగ్ చేసే వ్యక్తి కాదు. అలాంటి వ్యక్తి గురించి ఈ టైంలో ఈ విధంగా మాట్లాడటం తప్పుకాదు. ఈ సమయంలో తన కుటుంబం ఎంతో కంగారుగా బాధతో ఉంటారు. ఇలాంటప్పుడు మరణించిన వారి పేర్లు బయటకు తీసుకు రావడం మంచిది కాదు ఎందుకో నాకు నరేష్ గారు పెట్టిన బైట్ నచ్చలేదు ఇకపై ఎవరైనా ఇలాంటి బైట్లు పెట్టేముందు దయచేసి ఆలోచించండి పెట్టండి ఈ విధంగా మరణించిన వారి పేర్లను ప్రస్తావించి అందరినీ బాధ పెట్టకండి అంటూ శ్రీకాంత్ తెలియజేశారు.