ఆర్జే కాజల్ .. మొదటి నుంచి అన్ని భాషల్లో అన్ని సీజన్స్ బాగా కాచి వడగట్టి వచ్చాను, జనాలను ఎలా మెప్పించాలో నాకు బాగా తెలుసు అంటూ చెప్పుకుంది. ఇక తాజా ఎపిసోడ్ లో ఆమె కిచెన్ టీమ్ లో ఉండనంటే ఉండను అంటూ మొండికేసింది. తనకు వంట రాదు కాబట్టి కిచెన్ లో కి రాను అంది. మిగతా ఇంటి సభ్యులు ఎంత చెప్పిన వినడానికి సిద్ధం గా లేదు కాజల్. అంతే కాదు చివరకు వంట రాకపోయినా హెల్ప్ చేయడానికి సైతం ఆమె ఇష్టపడలేదు. తాను చిన్నతనం నుంచి ఎప్పుడు వంట చేసింది లేదు అంటూ చెప్పే ప్రయత్నం చేసింది. కిచెన్ తప్ప ఇతర పనులు ఏం చెప్పినా కూడా నేను సిద్దమే అంటూ చెప్పుకోచ్చింది కాజల్.
మరొక కంటెస్టెంట్ శ్రీరామ చంద్ర కాజల్ ని ఒప్పించే ప్రయత్నం చేసిన ఆమె వినలేదు. ఎవరు ఎన్ని చెప్పిన నేను వంట గదిలో కాలు కూడా పెట్టనని తెలిపింది. ఇక ఈ విషయం పై సోషల్ మీడియాలో కాజల్ పై ఒక రేంజ్ లో ట్రోలింగ్ జరుగుతుంది. వచ్చిన రెండో రోజు కొంత మంది ఇంటి సభ్యులు వంట చేయడానికి ఇష్టపడం లేదని, జిమ్ చేస్తున్నారు, టాస్కులు ఆడుతున్నారు, వంట రూమ్ లోకి రావడం లేదంటూ ఒక మీటింగ్ పెట్టి మరి పెత్తనం చేసే ప్రయంత్నం చేసింది. కానీ ఇప్పుడు తీరా చూస్తే వంట చేయడం రాదు అంటూ తప్పించుకుంటుంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇంటి సభ్యుల్లో కూడా ఆమె ప్రవర్తన పట్ల అంత అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం కాజల్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంత పెద్ద అబద్దం చెప్పి హౌస్ లో ఎలా ఉండాలనుకుంటుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకు ముందు హౌస్ లోకి వెళ్ళడానికి ముందు ఆమె తన సోషల్ మీడియాలో షేర్ చేసిన వంటల వీడియోలను పోస్ట్ చేస్తూ ప్రస్తుత కామెంట్స్ ని జత చేసి మరి ట్రోల్ల్స్ వేషున్నారు. కిచెన్ లో ఉంటె కెమెరాలకు ఎక్కువగా కనబడదు కాబట్టి కాజల్ ఇలా వంట రాదు అంటూ అబద్దం చెప్పిందని ఆమెపై జోక్స్ వేస్తున్నారు. సీజన్ 4 ముగిసిన తర్వాత అందరు కంటెస్టెంట్స్ ని ఇంటికి పిలిచి వారికి నచ్చినవి వండి వండించి సోషల్ మీడియాలో షేర్ చేసుకున్న విషయాన్నీ గుర్తు చేసుకుంటున్నారు అభిమానులు. ఇక మరో వైపు పని తప్పించుకోవడానికే ఇలా మాట్లాడింది కాజల్ అంటూ కొంత మంది అంటున్నారు. మొత్తానికి బిగ్ బాస్ హౌస్ లో కిచెన్ లోకి వెళ్లను అంటున్న కాజల్ గతంలో కిచెన్ లో చేసిన విన్యాసాల తాలూకు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక గతంలో కూడా కాజల్ బిగ్ బాస్ ఒక చేత షో అని చేసిన వ్యాఖ్యలను సైతం మీమర్స్ తేరా మీదకి తెస్తున్నారు. మొత్తానికి కాజల్ ఇలా మాట్లాడి నెటిజెన్ల చేతికి అడ్డంగా దొరికిపోయింది అనే చెప్పుకోవాలి. మరి ఇంత నెగటివిటీ మధ్య ఎన్ని రోజులు షో లో ఉంటుందో వేచి చూడాలి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…