Hero Yash: ఖరీదైన కారును కొనుగోలు చేసిన నటుడు యశ్… ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

Hero Yash: కన్నడ బుల్లితెర సీరియల్స్ లో నటిస్తూ బుల్లితెర నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని అనంతరం హీరోగా సినిమా అవకాశాలను అందుకోవడమే కాకుండా పలు సినిమాలలో నటిస్తూ కన్నడ చిత్ర పరిశ్రమలో హీరోగా కొనసాగుతున్నటువంటి నటుడు యశ్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.

ఈ విధంగా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి ఈయన ఎంతోమంది అభిమానులను కూడా సొంతం చేసుకున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కే జి ఎఫ్ సినిమా ద్వారా రాత్రికి రాత్రి పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయారు.ఇలా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈ హీరో తాజాగా ఖరీదైన కారును కొనుగోలు చేశారని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే ఈ కొత్త కారుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక యశ్ కొనుగోలు చేసిన కారు ఏంటి దాని ఖరీదు ఎంత అనే విషయానికి వస్తే.. ఖరీదైన ల్యాండ్ రోవర్ కంపెనీకి చెందిన రేంజ్ రోవర్ కొనగోలు చేశాడు యష్. దీని ఖరీదు సుమారు రూ.4 కోట్లు ఉంటుందని సమాచారం.

Hero Yash: రేంజ్ రోవర్ కొనగోలు చేసిన యశ్


ఇలాంటి ఖరీదైన లగ్జరీ కార్లను ఎక్కువగా వ్యాపారవేత్తలు సినీ సెలెబ్రిటీలు మాత్రమే కొనుగోలు చేస్తుంటారు. అయితే తాజాగా ఈయన కూడా ఈ ఖరీదైన కారును కొనుగోలు చేశారు. ఇప్పటికే యష్ వద్ద ఇప్పటికే మెర్సిడెస్ బెంజ్ డీఎల్ఎస్ 350 డి, ఆడి క్యూ 7, రేంజ్ రోవర్ ఎవోక్, మిత్సుబిషి పజెరో స్పోర్ట్స్, మెర్సిడెస్ జీఎల్‌సి 250 డి కూపే లాంటి ఖరీదైన లగ్జరీ కార్లు ఉన్నాయని తెలుస్తుంది.