ప్రజలకు షాకింగ్ న్యూస్.. కరోనా వ్యాక్సిన్ తీసుకుంటే హెచ్ఐవీ పాజిటివ్..?

దేశంలోని ప్రజల్లో చాలామంది కరోనా వ్యాక్సిన్ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. వీలైనంత త్వరగా కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే బాగుంటుందని భావిస్తున్నారు. అయితే శాస్త్రవేత్తలు తయారు చేస్తున్న కరోనా వ్యాక్సిన్లు ప్రజల్లో కొత్త భయాలను పుట్టిస్తున్నాయి. ఇప్పటికే ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న కొంతమందిలో సైడ్ ఎఫెక్ట్స్ కనిపించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆస్ట్రేలియా కరోనా వ్యాక్సిన్ ప్రజల్లో ఇతర సైడ్ ఎఫెక్ట్స్ కు కూడా కారణమవుతున్నట్టు తేలింది.

ఆస్టేలియా కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారిలో హెచ్ఐవీ పాజిటివ్ నిర్ధారణ కావడం గమనార్హం. సీఎస్‌ఎల్‌ ఔషధ సంస్థ, క్వీన్స్‌లాండ్‌ యూనివర్సిటీ తయారు చేసిన వ్యాక్సిన్ ప్రతికూల ఫలితాలు ఇవ్వడంతో వ్యాక్సిన్ ట్రయల్స్ ను అర్ధాంతరంగా రద్దు చేశారు. తొలి క్లినికల్ ట్రయల్స్ లో మంచి ఫలితాలను ఇచ్చిన ఈ వ్యాక్సిన్ రెండు, మూడు క్లినికల్ ట్రయల్స్ లో కొంత ప్రతికూల ఫలితాలను ఇచ్చింది. కొందరిలో ఏకంగా హెచ్ఐవీ నిర్ధారణ అవుతుండటంతో వ్యాక్సిన్ ట్రయల్స్ అర్ధాంతరంగా రద్దు అయ్యాయి.

అయితే శాస్త్రవేత్తలు మాత్రం ఈ వ్యాక్సిన్ వల్ల ఎలాంటి ప్రమాదం లేదని వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లు భయాందోళనకు గురి కావద్దని చెబుతున్నారు. హెచ్‌ఐవీ నిర్ధారణ పరీక్షల్లో వ్యాక్సిన్ వల్ల వచ్చిన యాంటీబాడీలు ప్రభావం చూపుతున్నాయని వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లు హెచ్ఐవీ నిర్ధారణ అయినట్లు భావించాల్సిన అవసరం లేదని వెల్లడిస్తున్నారు. కరోనా వ్యాక్సిన్ గురించి వెలుగులోకి వస్తున్న వార్తలు ప్రజలను మరింత టెన్షన్ పెడుతున్నాయి.

అయితే వ్యాక్సిన్ తీసుకున్న వారిలో మొదట్లో పాజిటివ్ వచ్చినా తరువాత నెగిటివ్ వస్తోందని అందువల్ల పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రయోగాలు రద్దు కావడంతో సదరు సంస్థకు 75 మిలియన్‌ డాలర్ల నష్టం వచ్చిందని సమాచారం.