దేశంలో మధుమేహ రోగుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. మధుమేహంతో బాధపడే వాళ్లు తప్పనిసరిగా తీసుకునే ఆహార పదార్థాల విషయంలో జాగ్రత్త వహించాలి. కొన్ని ఆహార పదార్థాలను మధుమేహ రోగులు అస్సలు తీసుకోకూడదు. కొన్ని ఆహార పదార్థాలను తీసుకుంటే షుగర్ లెవెల్స్ పెరగడంతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. శీతాకాలంలో మధుమేహ రోగులు తీసుకునే ఆహార పదార్థాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
టైప్ 2 డయాబెటిస్ ను అదుపులో ఉంచాలంటే షుగర్ లెవెల్స్ పెంచని ఆహార పదార్థాలకు ఎక్కువగా ప్రాధాన్యతనివ్వాలి. మధుమేహ రోగులు పూరీ, మక్కీ రోటీ, వేడివేడి ఆహార పదార్థాలను అస్సలు తినకూడదు. ఈ మూడు షుగర్ లెవెల్స్ ను వేగంగా పెంచుతాయి. నారింజ రసంను ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు. నారింజలో విటమిన్ సితో పాటు గ్లూకోజ్ ను విడుదల చేసే చక్కెరలు కూడా ఎక్కువగా ఉంటాయి.
నారింజ పండ్లలో ఫైబర్, ప్రోటీన్ తక్కువగా ఉండటం వల్ల గ్లూకోజ్ లెవెల్స్ త్వరగా పెరుగుతాయి. మధుమేహ రోగులు వేగించి ఫ్రై చేసిన ఆహారపదార్థాలను తీసుకోకూడదు. వేగించి ఫ్రై చేసిన ఆహార పదార్థాల్ల్లో ట్యాన్స్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ ట్యాన్స్ ఫ్యాట్స్ ఇన్ ఫ్లమేషన్ ను పెంచుతాయి. ఇలా జరగడం వల్ల శరీరంలో కణాలు ఇన్సులిన్ కు స్పందించవు.
శరీరంలో కణాలు స్ప్ందించకపోతే గ్లూకోజ్ లెవెల్స్ వేగంగా పెరుగుతాయి. వీటితో పాటు పాస్తా, రైస్, వైట్ బ్రెడ్ ను డయాబెటిస్ రోగులు తినకూడదు. చక్కెరతో తయారైన పానీయాలను సైతం అస్సలు తీసుకోకూడదు. ఎక్కువగా ప్రాసెస్ చేసిన తృణధాన్యాలను, ఎక్కువ రుచి కలిగిన కాఫీలను, డ్రై ఫ్రూట్స్ ను, సహజసిద్ధమైన చక్కెరను కలిగి ఉన్న తేనెను, ప్యాక్ చేయబడిన స్నాక్స్ ను, ఫ్రెంచ్ ఫ్రైస్ ను, పండ్ల రసాలు, ఫ్రూట్ ఫ్లేవర్ ఉన్న పెరుగును తీసుకోకూడదు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…