కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు శుభవార్త చెపింది. కేంద్ర ప్రభుత్వ టెక్స్‌టైల్ మంత్రిత్వ శాఖకు చెందిన ఈ సంస్థ 95 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇప్పటికే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా ఆసక్తి ఉన్న అభ్యర్థులు 2021 సంవత్సరం జనవరి నెల 7వ తేదీలోగా ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు కేవలం ఆన్ లైన్ లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
https://cotcorp.org.in/ వెబ్ సైట్ లో ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఉన్నాయి. మొత్తం 95 ఉద్యోగ ఖాళీల ద్వారా మేనేజ్‌మెంట్ ట్రెయినీ, జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్, జూనియర్ అసిస్టెంట్ (జనరల్), జూనియర్ అసిస్టెంట్ (అకౌంట్స్) ఉద్యోగాల భర్తీ జరుగుతోంది. మేనేజ్‌మెంట్ ట్రెయినీ ఉద్యోగాలకు 11 ఖాళీలు, కమర్షియల్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు 50 ఖాళీలు, జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు (జనరల్) ఉద్యోగాలకు 20 ఖాళీలు, జూనియన్ అసిస్టెంట్ (అకౌంట్స్) ఉద్యోగాలకు 14 ఖాళీలు ఉన్నాయి.
2020 సంవత్సరం నవంబర్ 1వ తేదీ నాటికి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఓబీసీ, జనరల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 1,500 రూపాయలుగా ఉండగా ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్-సర్వీస్‌మెన్ ఉద్యోగాలకు దరఖాస్తు ఫీజు 500 రూపాయలుగా ఉంది. కనీసం 50 శాతం మార్కులతో పాసైన అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఉద్యోగ ఖాళీలను బట్టి ఉద్యోగానికి సంబంధించిన అర్హతల్లో మార్పులు ఉంటాయి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత, ఉద్యోగ ఖాళీలను బట్టి వేతనంలో మార్పులు ఉంటాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…