నిరుద్యోగులకు శుభవార్త.. కాట‌న్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు..?

0
115

కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు శుభవార్త చెపింది. కేంద్ర ప్రభుత్వ టెక్స్‌టైల్ మంత్రిత్వ‌ శాఖ‌కు చెందిన ఈ సంస్థ 95 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇప్పటికే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా ఆసక్తి ఉన్న అభ్యర్థులు 2021 సంవత్సరం జనవరి నెల 7వ తేదీలోగా ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు కేవలం ఆన్ లైన్ లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

https://cotcorp.org.in/ వెబ్ సైట్ లో ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఉన్నాయి. మొత్తం 95 ఉద్యోగ ఖాళీల ద్వారా మేనేజ్‌మెంట్ ట్రెయినీ, జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్, జూనియర్ అసిస్టెంట్ (జనరల్), జూనియర్ అసిస్టెంట్ (అకౌంట్స్) ఉద్యోగాల భర్తీ జరుగుతోంది. మేనేజ్‌మెంట్ ట్రెయినీ ఉద్యోగాలకు 11 ఖాళీలు, కమర్షియల్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు 50 ఖాళీలు, జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు (జనరల్) ఉద్యోగాలకు 20 ఖాళీలు, జూనియ‌న్ అసిస్టెంట్ (అకౌంట్స్‌) ఉద్యోగాలకు 14 ఖాళీలు ఉన్నాయి.

2020 సంవత్సరం నవంబర్ 1వ తేదీ నాటికి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఓబీసీ, జనరల్, ఈడ‌బ్ల్యూఎస్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 1,500 రూపాయలుగా ఉండగా ఎస్సీ, ఎస్టీ, పీడ‌బ్ల్యూడీ, ఎక్స్-స‌ర్వీస్‌మెన్ ఉద్యోగాలకు దరఖాస్తు ఫీజు 500 రూపాయలుగా ఉంది. కనీసం 50 శాతం మార్కులతో పాసైన అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఉద్యోగ ఖాళీలను బట్టి ఉద్యోగానికి సంబంధించిన అర్హతల్లో మార్పులు ఉంటాయి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత, ఉద్యోగ ఖాళీలను బట్టి వేతనంలో మార్పులు ఉంటాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here