ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. 200 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. హెటిరో డ్రగ్స్ సంస్థలో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల కాగా 27 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. పురుష అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 2016 నుంచి 2020 లోపు బీఎస్సీ కెమిస్ట్రీ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
https://www.apssdc.in/ ద్వారా ఈ ఉద్యోగాల కోసం ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. జిల్లా స్కిల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ ఆధ్యర్యంలో ఈ ఉద్యోగాలకు అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలరోజుల పాటు శిక్షణా తరగతులు ఉంటాయి. విజయవంతంగా శిక్షణను పూర్తి చేసిన అభ్యర్థులకు హెటిరో డ్రగ్స్ కంపెనీలో ఉద్యోగం లభిస్తుంది. బీఎస్సీ కెమిస్ట్రీ కాకుండా ఇతర కోర్సులు చదివిన వాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోకూడదు.
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు 11,000 రూపాయలు వేతనంగా లభిస్తుంది. ప్రొడక్షన్ అలవెన్స్, ప్రొడక్షన్ ఎక్స్‌పెన్స్, నైట్ ఫిఫ్ట్ అలవెన్స్ కింద మొత్తం 16,800 రూపాయలు పొందే అవకాశం ఉంటుంది. ఏపీకి చెందిన అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది.
నోటిఫికేషన్ లో ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తివివరాలు ఉంటాయి. వేతనం తక్కువ అయినప్పటికీ ఉద్యోగులకు అనుభవాన్ని బట్టి వేతనం పెరిగే అవకాశం ఉంటుంది.
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…
అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…
ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…
రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…
జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…