ప్రపంచ దేశాల్లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. కేసుల సంఖ్య అంతకంతకూ తగ్గుతున్నా వెలుగులోకి వస్తున్న కొత్తవిషయాలు ప్రజలకు కరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదని గుర్తు చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న కరోనా కేసుల్లో ఎక్కువ సంఖ్యలో వయస్సు పైబడిన వాళ్లు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడేవాళ్లు కరోనా బారిన పడుతున్నారు. పెద్దలతో పోలిస్తే పిల్లల్లో తక్కువగానే కరోనా కేసులు నమోదవుతున్నాయి.
శాస్త్రవేత్తలు కరోనా వైరస్ సోకిన పిల్లల్లో మల్టీసిస్టమ్ ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్ లక్షణాలు కనిపిస్తున్నాయని.. అందువల్ల తల్లిదండ్రులు పిల్లల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. కరోనా వైరస్ సోకిన వాళ్లలో పెద్దలకు, పిల్లలకు లక్షణాల్లో మార్పులు ఉండటం గమనార్హం. సాధారణంగా కరోనా బారిన పడిన చిన్నారుల్లో వైరస్ కు సంబంధించిన లక్షణాలు ఎక్కువగా కనిపించడం లేదు.
కానీ మల్టీసిస్టమ్ ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్ బారిన పడిన చిన్నారుల్లో కండరాలు, ఒళ్లు నొప్పులు, శ్వాస సంబంధిత సమస్యలు, పెదాల రంగులో మార్పు, గొంతు నొప్పి, ఛాతీ నొప్పి, ఇతర సమస్యలు కనిపిస్తున్నాయి. పొదాలు పొడిబారి పగలడం వీళ్లలో ఎక్కువగా కనిపిస్తోంది. మెడ దగ్గర వాపు, కళ్లలో మంట, దద్దుర్లు లాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. కరోనా బారిన పడి మటీ సిస్టమ్ ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్ కొత్త కొత్త లక్షణాలు కనిపిస్తున్నాయి.
లిప్ హైపర్మియా, అరచేతులు ఎర్రబారడం లాంటి లక్షణాలు కూడా కనిపిస్తున్న నేపథ్యంలో తల్లిదండ్రులు పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండాల్సి ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…