బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ షో సీజన్ 4 స్టార్ మా ఛానెల్ లో విజయవంతంగా ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. వచ్చే ఆదివారం బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే జరగనుంది. అభిజిత్ బిగ్ బాస్ విన్నర్ అవుతారని ప్రచారం జరుగుతుండగా సోహైల్, హారిక, అరియానా కూడా బిగ్ బాస్ సీజన్ 4 టైటిల్ విన్నర్ అయ్యేందుకు ఎంతో కష్టపడుతున్నారు. మరికొన్ని రోజుల్లో ఈ సీజన్ విన్నర్ ఎవరవుతారో తేలిపోనుంది.
అయితే బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ కు ప్రైజ్ మనీ ఎంతిస్తారని ప్రేక్షకుల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. బిగ్ బాస్ సీజన్ 1 విన్నర్ శివబాలాజీ, సీజన్ 2 విన్నర్ కౌశల్ మండా, సీజన్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ లకు ఫ్రైజ్ మనీ రూపంలో 50 లక్షల రూపాయలు వచ్చాయి. బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ కు కూడా 40 లక్షల రూపాయలే ఫ్రైజ్ మనీగా ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. అయితే విన్నర్ అయినా ఫ్రైజ్ మనీ మొత్తాన్ని పొందలేరు.
నిజానికి రియాలిటీ షోల ద్వారా గెలుపొందే మొత్తానికి ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. కరోనా, లాక్ డౌన్ ప్రభావం బిగ్ బాస్ షోపై కూడా పడటంతో ఫ్రైజ్ మనీని తొమ్మిది లక్షల రూపాయలు తగ్గించారని.. ట్యాక్సులతో కలిపితే ఫ్రైజ్ మనీ 31 లక్షలు మాత్రమే విన్నర్ కు దక్కనుందని తెలుస్తోంది. ఇది తక్కువ మొత్తమే అయినా బిగ్ బాస్ విన్నర్ అంటే వచ్చే గుర్తింపు మాత్రం అంతా ఇంతా కాదు.
ఇకపోతే బిగ్ బాస్ సీజన్ 4 గ్రాండ్ ఫినాలేను మూడు రోజుల పాటు నిర్వహించనున్నారని గ్రాండ్ ఫినాలే రోజున సూపర్ స్టార్ మహేష్ బాబు గెస్ట్ గా హాజరు కానున్నారని తెలుస్తోంది. బిగ్ బాస్ ప్రేక్షకులు మాత్రం అభిజిత్ విన్నర్ అవుతాడని సోహైల్ రన్నర్ అవుతాడని తెలుస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…