Honey Trap: హనీ ట్రాప్ లో యువ క్రికెటర్.. ఫోటోలు వీడియోలతో బ్లాక్ మెయిల్.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన నిజం?

Honey Trap:టెక్నాలజీ పెరగడంతో సైబర్ నేరగాళ్లు మోసం చేసే వారి సంఖ్య కూడా ఎక్కువైందని చెప్పాలి ఈ క్రమంలోనే ప్రతిరోజు నిత్యం ఎన్నో ఫోన్ కాల్స్ అలాగే ఎన్నో మెసేజ్ లు మనకు వస్తూ ఉంటాయి. అయితే పొరపాటున ఇలాంటి మెసేజ్లను లేదా లింకులను ఓపెన్ చేస్తే పెద్ద ఎత్తున మోసపోవాల్సి ఉంటుంది.అదేవిధంగా మరికొందరు వారికి తెలియకుండానే హనీ ట్రాప్ లో పడి పెద్ద ఎత్తున ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. ప్రస్తుతం అలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు యువ క్రికెటర్.

ఢిల్లీకి చెందిన యువ క్రికెటర్ వైభవ్ కందపాల్ సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో భాగంగా కోల్‌కతాలో జరిగే మ్యాచ్ ల కోసం అక్కడికి వెళ్లారు.ఈ క్రమంలోనే అక్కడ ఒక ఫైవ్ స్టార్ హోటల్లో ఆయన బస చేశారు. అయితే డేటింగ్ యాప్ లో భాగంగా కొందరి వ్యక్తులతో చాట్ చేసినటువంటి యువ క్రికెటర్ తను ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకుని తన గదికి పిలిపించుకున్నారు.

ఈ క్రమంలోనే ఆ యువతి సైతం ఆ క్రికెటర్ గదికి వెళ్లి అతనితో ఎంతో సన్నిహితంగా మెలిగి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అయితే ఆ క్రికెటర్ కి తెలియకుండా అతనితో సన్నిహితంగా ఉన్నటువంటి సన్నివేశాలను ఆమె చిత్రీకరించారు.ఈ క్రమంలోనే అమ్మాయి కోసం తనతో సంప్రదించిన వ్యక్తులు రంగంలోకి దిగి ఆ ఫోటోలు వీడియోలను తనకి చూపించి పెద్ద ఎత్తున బ్లాక్ మెయిల్ చేశారు.


Honey Trap: పోలీసుల అదుపులోకి నిందితులు…

ఈ క్రమంలోనే చేసేదేమీ లేక యువ క్రికెటర్ తన దగ్గర ఉన్నటువంటి చైన్ డబ్బులు వారికి ఇచ్చినప్పటికీ తరచూ ఆ వ్యక్తుల నుంచి తనకు డబ్బులు కావాలంటూ ఫోన్ కాల్ రావడంతో విసిగిపోయిన క్రికెటర్ పోలీసులను ఆశ్రయించారు. నవంబర్ 2న స్థానిక బగుయాటి పోలీస్ స్టేషన్‌ను సంప్రదించి.. తనకు ఎదురైన విషయాన్ని పోలీసుల ఎదుట తెలియజేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసిన అనంతరం నిందితులు శుభంకర్ బిస్వాస్, రిషబ్ చంద్ర, శివ సింగ్లను అరెస్ట్ చేసి బారాసత్ కోర్టులో హాజరుపరిచారు.