Allu Arjun: సాధారణంగా మనం ఏదైనా ఎమోషన్ ను కంట్రోల్ చేసుకోలేక కొన్నిసార్లు కంటతడి పెట్టుకుంటాము.మన గురించి ఎవరైనా ఎమోషనల్ గా చెప్పిన లేకపోతే ఏదైనా బాధాకర సన్నివేశాలు తెలిసిన వెంటనే కళ్ళ నుంచి నీళ్లు రావడం సర్వసాధారణం. అయితే తాజాగా అల్లు అర్జున్ సైతం తన ఎమోషన్ ని దాచుకోలేక కంటతడి పెట్టుకున్నారు. ఇలా అల్లు అర్జున్ కంటతడి పెట్టుకోవడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే…
అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష్ నటించిన చిత్రం ఊర్వశివో రాక్షసివో.దాదాపు ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని మూడేళ్ల తర్వాత ఈ సినిమా విడుదల అయ్యి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో శిరీష్ అను ఇమ్మానుయేల్ మధ్య ఉన్నటువంటి రొమాంటిక్ లవ్ సన్నివేశాలు, వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ యువతను బాగా ఆకట్టుకోనీ ఈ సినిమాకు మంచి హిట్ అందించారు. ఈ విధంగా ఈ సినిమా మంచి విజయం అందుకోవడంతో చిత్ర బృందం హైదరాబాద్ లో సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సినిమా సక్సెస్ మీట్ కార్యక్రమానికి అల్లు అర్జున్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వేదికపై అల్లు అర్జున్ గురించి శిరీష్ మాట్లాడుతున్నటువంటి మాటలు విన్న అల్లు అర్జున్ ఒక్కసారిగా ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా అల్లు శిరీష్ మాట్లాడుతూ నేను అల్లు అర్జున్ కి తమ్ముడిగా పుట్టినందుకు ఎంతో అదృష్టవంతుణ్ణి. ఆయన నన్ను తమ్ముడిలా కాకుండా ఒక కొడుకుల ట్రీట్ చేస్తారు.
సోషల్ మీడియా వేదికగా ఏదైనా పోస్ట్ చేస్తే ముందు మై బేబీ సిరి అంటూ పోస్ట్ చేస్తారని చాలా రోజుల తర్వాత అన్నయ్యను కలిస్తే కనుక బుగ్గలు గిల్లి తనని ముద్దు చేస్తారని శిరీష్ తెలిపారు. నేను జీవితంలో ఏదైనా సాధించాలి అనుకుంటే అవేవీ మిగల్చకుండా అన్ని నాకోసం చేసి పెట్టారు. అందుకు అన్నయ్యకు థాంక్స్ అంటూ ఈ సందర్భంగా అల్లు శిరీష్ తన అన్నయ్య గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో అల్లు అర్జున్ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…