Honey Trap:టెక్నాలజీ పెరగడంతో సైబర్ నేరగాళ్లు మోసం చేసే వారి సంఖ్య కూడా ఎక్కువైందని చెప్పాలి ఈ క్రమంలోనే ప్రతిరోజు నిత్యం ఎన్నో ఫోన్ కాల్స్ అలాగే ఎన్నో మెసేజ్ లు మనకు వస్తూ ఉంటాయి. అయితే పొరపాటున ఇలాంటి మెసేజ్లను లేదా లింకులను ఓపెన్ చేస్తే పెద్ద ఎత్తున మోసపోవాల్సి ఉంటుంది.అదేవిధంగా మరికొందరు వారికి తెలియకుండానే హనీ ట్రాప్ లో పడి పెద్ద ఎత్తున ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. ప్రస్తుతం అలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు యువ క్రికెటర్.
ఢిల్లీకి చెందిన యువ క్రికెటర్ వైభవ్ కందపాల్ సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో భాగంగా కోల్‌కతాలో జరిగే మ్యాచ్ ల కోసం అక్కడికి వెళ్లారు.ఈ క్రమంలోనే అక్కడ ఒక ఫైవ్ స్టార్ హోటల్లో ఆయన బస చేశారు. అయితే డేటింగ్ యాప్ లో భాగంగా కొందరి వ్యక్తులతో చాట్ చేసినటువంటి యువ క్రికెటర్ తను ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకుని తన గదికి పిలిపించుకున్నారు.
ఈ క్రమంలోనే ఆ యువతి సైతం ఆ క్రికెటర్ గదికి వెళ్లి అతనితో ఎంతో సన్నిహితంగా మెలిగి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అయితే ఆ క్రికెటర్ కి తెలియకుండా అతనితో సన్నిహితంగా ఉన్నటువంటి సన్నివేశాలను ఆమె చిత్రీకరించారు.ఈ క్రమంలోనే అమ్మాయి కోసం తనతో సంప్రదించిన వ్యక్తులు రంగంలోకి దిగి ఆ ఫోటోలు వీడియోలను తనకి చూపించి పెద్ద ఎత్తున బ్లాక్ మెయిల్ చేశారు.
ఈ క్రమంలోనే చేసేదేమీ లేక యువ క్రికెటర్ తన దగ్గర ఉన్నటువంటి చైన్ డబ్బులు వారికి ఇచ్చినప్పటికీ తరచూ ఆ వ్యక్తుల నుంచి తనకు డబ్బులు కావాలంటూ ఫోన్ కాల్ రావడంతో విసిగిపోయిన క్రికెటర్ పోలీసులను ఆశ్రయించారు. నవంబర్ 2న స్థానిక బగుయాటి పోలీస్ స్టేషన్‌ను సంప్రదించి.. తనకు ఎదురైన విషయాన్ని పోలీసుల ఎదుట తెలియజేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసిన అనంతరం నిందితులు శుభంకర్ బిస్వాస్, రిషబ్ చంద్ర, శివ సింగ్లను అరెస్ట్ చేసి బారాసత్ కోర్టులో హాజరుపరిచారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…