Virat Kohli: భారత క్రికెటర్ విరాట్ కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. కేవలం ఇండియన్స్ మాత్రమే కాకుండా విదేశీ వ్యక్తుల సైతం తనకు అభిమానులుగా ఉన్నారు అంటే ఈయనకు ఎలాంటి క్రేజ్ ఉందో మనకు తెలిసింది. ఇలా ఇంగ్లాండ్ కి చెందిన ఎలీ అనే ఒక బ్లైండ్ యువతి విరాట్ కోహ్లీకి అభిమానిగా మారిపోయారు. తనకు కళ్ళు కనిపించక పోయిన ఓ ఇంటర్వ్యూలో విరాట్ కోహ్లీ బయోగ్రఫీ విన్న తర్వాత ఆమె తనకు అభిమానిగా మారిపోయినట్లు వెల్లడించారు.
ఇలా ఇంగ్లాండ్ కి చెందిన ఈమె విరాట్ కోహ్లీకి వీరాభిమానిగా మారడంతో కోహ్లీ కోసం వరల్డ్ కప్ మ్యాచ్ చూడటం కోసం ఆస్ట్రేలియా వెళ్లారు. ఈమె విరాట్ కోహ్లీ బయోగ్రఫీ విన్న తర్వాత ఆయనని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నానని ఓ ఇంటర్వ్యూ సందర్భంగా వెల్లడించారు. తనకు టెన్నిస్ అంటే ఎంతో ఇష్టమని చెప్పిన ఎలీ కోహ్లీ కూడా టెన్నిస్ అంటే ఇష్టపడతారని తెలుసుకుంది.
కోహ్లీ ఎలా ఉంటారో ఎలా ఆడతారో తెలియక పోయినప్పటికీ ఈమె తనకు అభిమానిగా మారిపోవడంతో విరాట్ కోహ్లీ సైతం ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.అయితే ఇలా ఒక బ్లైండ్ ఉమెన్ తనకు అభిమానిగా మారిపోయారని తెలియడంతో విరాట్ సైతం తన జెర్సీతో పాటు ఆటోగ్రఫీ చేసినటువంటి ఒక బ్యాట్ ను కూడా తనకు బహుమానంగా ఇచ్చారు.
ఇక ఈమెకు కోహ్లీ పై ఉన్న ప్రేమకు తన తల్లి ఎప్పుడు కూడా అడ్డు చెప్పలేదు తన తల్లి ఇంగ్లాండ్ కి మద్దతు తెలుపగా ఈమె మాత్రం కోహ్లీ కోసం ఇండియాకి సపోర్ట్ చేస్తున్నారు. ఇలా ఈమె ఇండియాని సపోర్ట్ చేస్తున్నప్పటికీ తన తల్లి ఏమాత్రం అడ్డు చెప్పలేదు. ఇకపోతే ఈ మ్యాచ్ చూడటం కోసం ఆమె తన తల్లి సహాయంతో ఏకంగా స్టేడియంకు రావడంతోనే తనకు కోహ్లీ అంటే ఏ విధమైనటువంటి అభిమానం ప్రేమ ఉందో అర్థం అవుతుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…