ఆచార్యలో రామ్ చరణ్ ఎన్ని నిమిషాల వరకు ఉంటాడు.. దీనిపై క్లారిటీ వచ్చేసింది!

‘ఆచార్య’ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం. దీనిలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ చిత్రంలో ఒక కీలకమైన పాత్ర పోషించనున్నారని తెలిసింది. చరణ్ ‘సిద్ధ’ పాత్రలో సందడి చేయనున్నాడు. ఇప్పటికే సిద్ధ పాత్రకు సంబంధించి టీజర్ విడుదలైన విషయం విధితమే. టీజర్ యూట్యూబ్‌లో విడుదలైన 24 గంటల్లోనే 6.8 మిలియన్ల వీక్షణలను సాధించింది.

మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీలపై నిరంజన్‌రెడ్డి , రామ్ చరణ్ ఈ సినిమాను నిర్మించారు. అయితే ‘ఆచార్య’లో రామ్ చరణ్ పాత్ర నిడివి ఎంత..? ఇది అతిథి పాత్రనా లేదా పూర్తి స్థాయి పాత్రా..? ఇప్పుడు దీనికి సంబంధించి కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అతడి పాత్ర ఇందులో దాదాపు 45 నిమిషాల వరకు ఉంటుందట.

మొదటి హాఫ్ లో 5 నిమిషాలు.. సెకండాఫ్ లో 40 నిమిషాల వరకు ఉంటుందని తెలుస్తోంది. దర్శకుడు కొరటాల శివ చరణ్‌కి మొదట్లో గెస్ట్ రోల్ మాత్రమే రాశాడట. తర్వాత అతడి నిడివిని పెంచే అవసరం ఏర్పడగా.. 2020లో మళ్లీ కొత్తగా కథను రీ రైట్ చేశారట. మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక ఈ సినిమాపై దర్శకుడు మాట్లాడుతూ.. సినిమాలో చిరు-చరణ్ కాంబినేషన్ లో వచ్చే సన్నివేశాలు అభిమానులకు కనువిందు చేస్తాయని అన్నారు. ఇటీవల విడుదలైన టీజర్ చివర్లో తండ్రీకొడుకులు ఒకే ఫ్రేమ్‌లో కనిపించి అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చారు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే నటిస్తుంది. చిరంజీవి సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.