టాలీవుడ్ తెలుగు గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నవంబర్ 30 సాయంత్రం 4:07 గంటలకు తుది శ్వాస విడిచారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) అతని కుటుంబానికి తన సానుభూతిని తెలియజేసారు. అంతే కాకుండా సిరివెన్నెలతో తన అనుబంధాన్ని పంచుకున్నారు. దీనిపై అతడు ప్యాడ్‌కాస్ట్ రూపంలో రెండు ఆడియో క్లిప్స్‌ను ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు.
షేర్ చేసిన ఆడియో టేప్‌లో.. ఆర్జీవీ తన శివ సినిమాలోని పాటలకు సిరివెన్నెల సాహిత్యం రాశారని చెప్పారు. సిరివెన్నెల రాసిన .. ‘సాహసమే నా దారి రాజసం నా రథాన్ని ఆపడం సాధ్యమేనా’ అన్న మాటలు నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ పాటలోని పదాలే నా ప్రాణం. ఇంత అద్భుతమైన మాటలు రాయడం వల్ల.. ఎంతో మంది జీవితాలను ప్రభావితం చేసిన మీరు తప్పకుండా స్వర్గానికి వెళ్తారు.
దుఃఖంతో సిరివెన్నెల దర్శనమిస్తే స్వర్గంలో కలిసి అమృతం తాగాలని కోరాడు. ఒక వేళ అక్కడ వాట్సాప్ లాంటివి ఉంటే.. అమృతం ఎలా ఉందో వాట్సాప్ చేయండంటూ కోరారు. అంతే కాకుండా.. అక్కడ రంభ, ఊర్వశి, మేనకలు ఎలా ఉన్నారో చెబితే తాను సంతోషిస్తానన్నాడు. ప్రస్తుతం తాను హైదరాబాద్ లో ఉన్నాను.. మీరు స్వర్గం లో ఉన్నారు అంతే తేడా అన్నారు వర్మ.
ఇక అతడు షేర్ చేసిన ఆ ఆడియో టేప్ లో.. తెలివి ఉన్నవాడు ఎవడైనా స్వర్గంలోకే వెళ్తాడని.. మీరు స్వర్గానికి వెళ్లినందుకు తనకు హ్యాపీగా ఉందంటూ ఆసక్తిర వ్యాఖ్యలు చేశాడు. రాబోయే తరాలకు సిరివెన్నెల స్ఫూర్తి అని ఆర్జీవీ కొనియాడాడు. అయితే వర్మ పోస్ట్ పై నెటిజన్లు ఓ రేంజ్ లో స్పందిస్తున్నారు. నీ క్రియేటివిటీకి దండరా సామి అంటూ కొందరు దండుకుంటున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…