దక్షిణ గుజరాత్‌లో వాతావరణంలో అకస్మాత్తుగా మారిపోయింది. దీంతో పలు నగరాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. అదే సమయంలో.. గిర్-సోమ్‌నాథ్ సమీపంలోని అరేబియా సముద్రంలో బలమైన గాలులు తలెత్తాయి. 12 మత్స్యకారులకు సంబంధించి పడవలు మునిగిపోయాయి. ఈ పడవల్లో 23 మంది మత్స్యకారులు ఉండగా.. వారిలో 11 మంది గల్లంతయ్యారు.
మత్స్యకారుల జాడ కోసం అధికారులు నేవీ సహాయం తీసుకున్నారు. అదే సమయంలో రెండు ఆర్మీ హెలికాప్టర్లను కూడా ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా.. ఒక రోజు ముందుగానే మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పశ్చిమ కల్లోల ప్రభావంతో దక్షిణ గుజరాత్‌లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
అంతే కాకుండా మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని సూచించారు. సముద్రంలో ఎక్కువ దూరం చేపలు పట్టడానికి వెళ్లే మత్స్యకారులను ముఖ్యంగా హెచ్చరించారు. అయితే వాళ్లు చెప్పిన విధంగానే ఎక్కువ దూరం చేపలు పట్టేందుకు వెళ్లిన మత్స్యకారులు తమ పడవలు తీసుకొని తిరుగు ప్రయాణం అయ్యారు. కానీ 12 పడవలు మాత్రం ముందుగానే ఒడ్డుకు చేరుకోలే పోయారు.
దీంతో ఎవరూ ఊహించని విధంగా అలలు ఎక్కువగా కావడంతో.. వాళ్లు ఆ అలల్లో చిక్కుకుపోయారు. వాళ్ల జాడ కోసం అధికారులు విపరీతంగా ప్రయత్నిస్తున్నారు. దక్షిణ గుజరాత్ లో వర్షం కారణంగా ఒకే రోజులో మూడు డిగ్రీల ఉష్ణోగ్రత పడిపోయింది. డయ్యూలో కూడా బలమైన గాలులతో కూడిన భారీ వర్షాల కారణంగా అక్కడ ఓ పడవ మునిగిపోవడంతో ఒక మత్స్యకారుడు మరణించాడు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…