‘ఆచార్య’ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం. దీనిలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ చిత్రంలో ఒక కీలకమైన పాత్ర పోషించనున్నారని తెలిసింది. చరణ్ ‘సిద్ధ’ పాత్రలో సందడి చేయనున్నాడు. ఇప్పటికే సిద్ధ పాత్రకు సంబంధించి టీజర్ విడుదలైన విషయం విధితమే. టీజర్ యూట్యూబ్‌లో విడుదలైన 24 గంటల్లోనే 6.8 మిలియన్ల వీక్షణలను సాధించింది.
మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీలపై నిరంజన్‌రెడ్డి , రామ్ చరణ్ ఈ సినిమాను నిర్మించారు. అయితే ‘ఆచార్య’లో రామ్ చరణ్ పాత్ర నిడివి ఎంత..? ఇది అతిథి పాత్రనా లేదా పూర్తి స్థాయి పాత్రా..? ఇప్పుడు దీనికి సంబంధించి కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అతడి పాత్ర ఇందులో దాదాపు 45 నిమిషాల వరకు ఉంటుందట.
మొదటి హాఫ్ లో 5 నిమిషాలు.. సెకండాఫ్ లో 40 నిమిషాల వరకు ఉంటుందని తెలుస్తోంది. దర్శకుడు కొరటాల శివ చరణ్‌కి మొదట్లో గెస్ట్ రోల్ మాత్రమే రాశాడట. తర్వాత అతడి నిడివిని పెంచే అవసరం ఏర్పడగా.. 2020లో మళ్లీ కొత్తగా కథను రీ రైట్ చేశారట. మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇక ఈ సినిమాపై దర్శకుడు మాట్లాడుతూ.. సినిమాలో చిరు-చరణ్ కాంబినేషన్ లో వచ్చే సన్నివేశాలు అభిమానులకు కనువిందు చేస్తాయని అన్నారు. ఇటీవల విడుదలైన టీజర్ చివర్లో తండ్రీకొడుకులు ఒకే ఫ్రేమ్‌లో కనిపించి అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చారు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే నటిస్తుంది. చిరంజీవి సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…