హుజురాబాద్‌ హస్తం పార్టీ అభ్యర్థి ఆమెనా..?

తెలంగాణలో రాజకీయాలలో వేడి పుట్టిస్తున్న ఆంశం హుజురాబాద్ ఉపఎన్నిక. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ రాజీనామాతో అనివార్యమైన హుజురాబాద్‌ ఉపఎన్నిక కోసం ప్రధాన రాజకీయ పార్టీలు సిద్దమవుతున్నాయి. తెరాస,బీజేపీ వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకు వెళ్తూ గెలుపు కోసం ప్రయత్నిస్తున్నాయి. మరో ప్రధాన కాంగ్రెస్ మాత్రం ఈ రేసులో కాస్త వెనుబడిందని చెప్పవచ్చు. ఇప్పడు అభ్యర్థిని కూడా ప్రకటించలేదు.

గ‌త ఎన్నిక‌ల్లో కాంగ్రెస్​ తరఫున పోటీ చేసిన పాడి కౌశిక్ రెడ్డి ఇప్పుడు గులాబీ కండువా కప్పుకున్నారు. దీంతో అభ్యర్థి కోసం కాంగ్రెప్ వేట మొదలు పెట్టింది. సామాజిక స‌మీక‌ర‌ణాల దృష్ట్యా పరిగణిలోకి తీసుకుని.. తెరాస, భాజపా… బీసీ అభ్యర్థిని బరిలో దింపాయి. కాంగ్రెస్ కూడా ఆ వర్గం నుంచే అభ్యర్థిని నిలపాలని చూస్తోంది. బీసీ అభ్యర్థి … మహిళా అభ్యర్థి అయినా కొండ సురేఖను బరిలోకి దింపే అవకాశాలు కనిపిస్తున్నాయి.