కొన్ని కొన్ని సంఘటనలు వింటుంటే.. అవునా.. ఇలా జరిగిందా అంటూ మనం ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటాం. అలాంటిది మన అభిమాన హీరోల విషయాలు అయితే మాత్రం ఎక్కడ లేని ఆత్రుత ఉంటుంది. ఇలాంటి ఘటన ఒకటి మెగస్టార్ చిరంజీవికి జరిగింది. అదేంటంటే.. అత్యధిక చిత్రాల్లో నాయికగా నటించిన తార రాధికతో చిరంజీవి కాంబినేషన్ లో 28 సినిమాల వరకు వచ్చాయి. అప్పటి నుంచే వీరి మధ్య స్నేహం కొనసాగుతోంది.
అయితే చిరంజీవి చెన్నై వెళ్లినా.. రాధిక హైదరాబాద్ వచ్చినా ఆతిథ్యం ఇస్తుంటారు. అంతటి సన్నిహితత్వం ఆ ఇద్దరి మధ్యా ఉంది. వారి సినిమాల్లో అతి పెద్ద హిట్ అయిన సినిమా అభిలాష. అయితే ఈ సినిమా సమయంలో వీరిద్దరి మధ్య ఏదో జరిగి .. ఒకరికొకరు మాట్లాడుకునే వారు కాదంట. దర్శకుడు పిలిస్తే వెళ్లి.. ఆయన చెప్పింది చేసి ఎవరి దారి వాళ్లు చూసుకునే వారంట. ఈ సినిమాలో పాటలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో పెద్దగా చెప్పాల్సిన పని లేదు.
ఆ పాటల్లో వారి మధ్య కెమిస్ట్రీ చూస్తే వాళ్ల మధ్య మాటలు లేవని ఎవరూ అనుకోరు. అయితే నవ్వింది మల్లెచెండు పాటలో ఓ అనూహ్య సంఘటన ఎందురైంది. దానిని వైజాగ్ బీచ్ దగ్గర్లో షూట్ చేశారు. అక్కడ జనం మధ్యలో పాట చిత్రీకరిస్తుండగా.. “యురేకా సకమిక” అంటూ రాధిక పైనుంచి దూకే షాట్ అది. అయితే చిరంజీవి ఆ షాట్ ను చేసి.. పైనుంచి దూకి ఇసుకలోనే పడి ఉండిపోయారు. షాట్ బాగానే వచ్చింది. తర్వాత సీన్ కు ఓకె అవుతున్నారు అందరు. కానీ చిరంజీవి మాత్రం ఆ ఇసుకలో నుంచి లేవలేదు. రాధికను అప్పుడు చిరంజీవి “ఎక్స్‌క్యూజ్ మీ” అన్నారు.
నన్ను పిలిచారా అంటూ రాధిక అడిగింది. అవును జంప్ చేసినప్పుడు ప్యాంట్ చిరిగిపోయింది. నేను లేవలేను. చుట్టూ ఫ్యాన్స్ ఉన్నారు.. సహాయం చేయండి అంటూ చిరంజీవి అనగా.. తనకు సారీ చెబితే సహాయం చేస్తానంటూ రాధిక చెప్పింది. జంప్ చేసే సీన్ కాబట్టి చిత్ర బృందం చాలా దూరంలో ఉన్నారు. ఎట్టకేలకు సారీ చెప్పాక.. తన చీర కొంగు అడ్డుతో చిత్ర బృందం దగ్గరకు తీసుకెళ్లింది రాధిక. ఆ తర్వాత సీన్ నుంచి మళ్లీ వాళ్లిద్దరు మాట్లాడుకుంటూ.. చిత్రాన్ని ముందుకు నడిపించారు. ఈ ఘటన గురించి రాధిక ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్‌లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లోని ఆస్తుల…