మాకు సెలవులు ఇవ్వండి.. ఆ దుర్మార్గుడిని పట్టుకుంటాం..

సైదాబాద్ లో జరిగిన అత్యాచార, హత్య ఘటనపై ప్రతీ ఒక్కరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ నిందితుడిని పట్టిస్తే రూ.10 లక్షలు రివార్డు అందజేస్తామని పోలీసులు కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఎన్ని పై ఎత్తులు వేసినా ఆ నిందితుడు మాత్రం కనిపించలేదు. అందరి డిమాండ్ ఇప్పుడు ఒక్కటే.. నిందితుడిని పట్టుకొని కఠినమైన శిక్షను అమలు చేయాలని.

అందులో సామాన్యులు కూడా భాగస్వాములవుతున్నారు. ఇదిలా ఉండగా.. హైదరాబాద్ లో ఉద్యోగాలు చేసే చాలామంది దీనిపై తీవ్రంగా స్పందిస్తున్నారు. అతడిని పట్టుకోవడానికి మాకు అవకాశం ఇవ్వండంటే.. తమకు సెలవులు కావాలంటూ తమ కంపెనీ బాస్ లను అడుగుతున్నారు. మాకు ఒక వారంరోజులు సెలువులు ఇవ్వండి ఆ దుర్మార్గుడు రాజుని పట్టుకొస్తామంటూ అర్జీలు పెడుతున్నారంట.

పోలీసులు అనౌన్స్ చేసిన ఆ రివార్డు కోసం కాదంటూ.. ఆ ఘటన విన్న మాకు రక్తం మరిగిపోతుందని.. అలాంటి నీచులు ఈ సమాజంలో ఉండటానికి అర్హత లేదంటూ చెప్పారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా.. ఇలాంటి దుర్మార్గులు ఇంకొకరు తయారు కాకుండా ఉండాలంటే అతడికి కఠిన శిక్షలు అమలు చేయాలని వాళ్లు కోరుతున్నారు.

మాకు ఆ నీచుడిని వెతికి పట్టుకునేందుకు అవకాశం ఇవ్వాలని.. దానికి తమకు సెలవులు కావాలంటూ దరఖాస్తులు పెడుతున్నట్లు సమాచారం. బాధిత కుటంబసభ్యులను పరామర్శించేందుకు రాజకీయ ప్రముఖులతో పాటు.. సీని ప్రముఖులు కూడా అక్కడికి క్యూ కడుతున్నారు. ఎంతో సంచలనంగా మారిన ఈ కేసులో తమ వంత భాగస్వాములు అవుతామంటూ పేర్కొంటున్నారు.