ఛలో చిత్రంతో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టిన కన్నడ భామ రష్మికా మందన్న. మొదటి సినిమాతోనే ఊహించని క్రేజ్ నీ సాధించి పెట్టుకున్న రష్మికా.. ‘గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు, భీష్మ’ లాంటి వరుస విజయాలను తన ఖాతాలో వేసుకొని మంచి ఫామ్ ఉన్న హీరోయిన్ల జాబితాలో స్థానం సంపాదించుకున్నారు. తన అందచందాలతో కుర్రాళ్ళ మనసు దోచుకున్న ఈ బ్యూటీ.. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయింది. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషా చిత్రాల్లో కూడా నటిస్తూ నేషనల్ క్రష్ అయింది రష్మిక.
ఇకపోతే ఈ మధ్యకాలంలో నెమ్మదిగా హాట్ డోస్ పెంచేస్తూ హీటు పుట్టిస్తోంది ఈ ముద్దుగుమ్మ.
అయితే ప్రస్తుతం ఆమె బాలీవుడ్‌లో ‘మిస్టర్ మంజు, గుడ్‌బై’ అనే సినిమాలతో పాటు తాజాగా మరో సినిమాను కూడా ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. ఇక తెలుగులో ‘పుష్ప’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. దీంతో పాటు ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ అనే మూవీ చేస్తోంది. అయితే బాలీవుడ్‌లో వరుసగా సినిమా ఆఫర్లు వస్తుండటంతో ముంబైలో ఓ అపార్ట్‌మెంట్‌ని కొనుగోలు చేశారు రష్మిక.
ముంబై వెళ్లిన ప్రతిసారి హోటల్ లో ఉండాల్సి వస్తుండటంతో తాను ఈ నిర్ణయం తీసుకుందట. ఈ విషయాన్ని ఆమే స్వయంగా వెల్లడించారు.తాజాగా ఈ విషయంపై స్పందించిన రష్మిక.. మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఎక్కువ సమయంలో హోటల్‌లో ఉంటడం తనకు ఇష్టం లేదని… అందుకే ముంబైలో ఓ ఇళ్లు కొనుగోలు చేశానని చెప్పారు. ఇక్కడి నుంచి షూటింగ్‌కి వెళ్లడం ఎంతో సౌకర్యంగా ఉండడంతో తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేరకొన్నరు రష్మీక.
ఇక ఎప్పటికి తన కుటుంబంతో కలిసి ఉండటమే తనకు ఇష్టమని.. తనకు తన సోదరికి 16 సంవత్సరాల వయస్సు తేడా ఉందని.. ఆమెకు తానే రెండో తల్లి అని రష్మీక తెలిపారు. ఇక తన అపార్ట్‌మెంట్ లోపల ఇంటీరియర్ డిజైనింగ్ కూడా తానే చేసినట్లు రష్మిక ఆనందం వ్యక్తం చేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…