Chiranjeevi: దాసరి నిర్ణయంతో ఆ రోజు చిరంజీవి మొహం చూడలేకపోయాను.. దవళ సత్యం కామెంట్స్ వైరల్!

Chiranjeevi: దాసరి నిర్ణయంతో ఆ రోజు చిరంజీవి మొహం చూడలేకపోయాను.. దవళ సత్యం కామెంట్స్ వైరల్!

Chiranjeevi:తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న దవల సత్యం దర్శకత్వంలో ఎన్నో అద్భుతమైన సినిమాలు తెరకెక్కాయి. ధవళ సత్యం దాసరి గారి జూనియర్ కావడంతో ఆయన సహాయంతో ఇండస్ట్రీలోకి వచ్చారు. ఇండస్ట్రీలోకి రాకముందు ఇద్దరూ కలిసి నాటకాలు వేస్తూ ఉండేవాళ్లమని అనంతరం దాసరి సహాయంతోనే ఇండస్ట్రీలోకి వచ్చానని తెలిపారు.

Chiranjeevi: దాసరి నిర్ణయంతో ఆ రోజు చిరంజీవి మొహం చూడలేకపోయాను.. దవళ సత్యం కామెంట్స్ వైరల్!
Chiranjeevi: దాసరి నిర్ణయంతో ఆ రోజు చిరంజీవి మొహం చూడలేకపోయాను.. దవళ సత్యం కామెంట్స్ వైరల్!

ఇకపోతే దాసరి దర్శకత్వంలో తెరకెక్కిన శివరంజని సినిమా కోసం ధవళ సత్యం కో-డైరెక్టర్ గా పనిచేశారు. ఇక ఈ సినిమాకి నలుగురు హీరోలు ఆప్షన్ గా ఉన్నారు. చిరంజీవి, సుధాకర్, హరిప్రసాద్, ఇంకొక హైదరాబాద్ చెందిన ఒక అబ్బాయి నలుగురు హీరోలు ఆప్షన్ గా ఉన్నారు. నా ఒపీనియన్ అయితే నేను శివరంజని సినిమా కోసం చిరంజీవిని తీసుకోవాలని దాసరి గారికి చూపించాను. ఇక పద్మజా వదిన సుధాకర్ పేరు ప్రస్తావించారు.

Chiranjeevi: దాసరి నిర్ణయంతో ఆ రోజు చిరంజీవి మొహం చూడలేకపోయాను.. దవళ సత్యం కామెంట్స్ వైరల్!

ఇకపోతే హైదరాబాద్ నుంచి కొందరు రాజకీయ నాయకుల హరిప్రసాద్ ను హీరోగా తీసుకోవాలని ఫోన్లు చేసేవారు. ఇక ఈ విషయంలో బాగా ఆలోచించిన దాసరిగారు ఈ సినిమాకి హరి ప్రసాద్ ను ఫైనల్ చేశారు.అదేంటి అన్నయ్య అలా చేసావంటే ఇండస్ట్రీలో కొన్ని కొన్ని విషయాలలో ఇలాగే వ్యవహరించాల్సి ఉంటుంది. నువ్వు ఎలా చేస్తావో తెలియదు హరి ప్రసాద్ ని హీరోగా అద్భుతంగా చూపించాలి అంటూ దాసరి గారు చెప్పారు.

రాజకీయ నాయకుల ఒత్తిడే కారణం….

ఈ విధంగా శివరంజని సినిమా కోసం హీరోగా హరి ప్రసాద్ ను సెలెక్ట్ చేయగానే నేను బయటకు వెళ్లి పోయాను.అయితే బయట చిరంజీవి గారు నా కోసం ఎదురు చూస్తున్నారు. నేను కనబడితే నాకు చెప్పేసి వెళ్లిపోవాలని ఆయన ఎదురు చూస్తున్నారు. అయితే ఆ సమయంలో నేను చిరంజీవి మొహం చూడలేకపోయానని ఈ సందర్భంగా దవళ సత్యం శివరంజని సినిమా సమయంలో జరిగిన సంఘటన గురించి తెలియజేశారు. అయితే ఈ సినిమా పెద్దగా హిట్ కాలేదని హరిప్రసాద్ స్థానంలో చిరంజీవిని పెట్టి ఉంటే సినిమానే వేరే ఉండేది అంటూ ఆయన తెలిపారు. ఇకపోతే తాను డైరెక్టర్ అయిన తర్వాత జాతర సినిమా కోసం మెగాస్టార్ చిరంజీవిని హీరోగా సెలెక్ట్ చేశానని, ఆ విషయంలో ఎవరు చెప్పినా వినకుండా చిరంజీవి హీరోగా పెట్టి జాతర సినిమా చేశానని తెలిపారు.