జగన్ పై ప్రత్యేక అభిమానం లేదు.. సంచలన వ్యాఖ్యలు చేసిన వర్మ..!

వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అనగానే గుర్తుకు వచ్చేది రామ్ గోపాల్ వర్మ. వివాదాలు కావాలనే స్పష్టించుకుంటాడు. వైఫైలా తన చుట్టే తిరగాలని కోరుకుంటాడు. తాజాగా అతడు ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. వర్మ దర్శకత్వంలో వర్మ కీలక పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘ఆర్జీవీ మిస్సింగ్’. దీనికి సంబంధించిన ట్రైలర్ ఇటీవల విడుదల అయింది. ఈ ట్రైలర్ గురించి
సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతోంది.

ఈ ట్రైలర్ లో మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ కోణంలో తీసినట్లు కనిపిస్తోంది. ఇందులో ప్రముఖ రాజకీయ నాయకులను టార్గెట్ చేసినట్లు స్ఫష్టంగా అర్థం అవుతోంది. ముఖ్యంగా ఇందులో టీడీపీ, జనసేన పార్టీల అభిమానులకు కోపం వచ్చే విధంగా ఉందంటూ.. ఆ పార్టీల అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా వర్మ టీడీపీ, జనసేన పార్టీల అభిమానులకు కోపం వచ్చే విధంగా ఈ మధ్య కాలంలో సినిమాలను తెరకెక్కిస్తున్నారు. అయితే సీఎం జగన్ కు వ్యతిరేకంగా మాత్రం ఏనాడు కామెంట్లు చేయలేదు. అలాంటి సీన్స్ కూడా ఎక్కడా కనిపించలేదు. అతడు చాలా సందర్భాల్లో సోషల్ మీడియా వేదికగా రియల్ హీరో జగన్ అంటూ కామెంట్లు చేశాడు. ఎందుకు ఇలా చేస్తున్నారంటూ అతడిపై సోషల్ మీడియాలో ప్రశ్నలు సంధించగా.. అతడు ఈ విధంగా స్పందించాడు.. జగన్ నాయకత్వ లక్షణం నిజమైన నాయకుడికి ఉండాల్సిన విధంగా ఉంటాయని.. అతడి బిహేవియర్ తనకు నచ్చుతుందని.. అందుకే అతడిపై స్పూఫ్ చేయడానికి స్కోప్ లేదంటూ వర్మ అన్నారు.

ఈ కారణంగానే జగన్ పై సూఫ్ లాంటివి చేయలేదన్నారు. అంతేకానీ జగన్ పై ఎటువంటి ప్రత్యేక అభిమానం లేదని చెప్పాడు. ఈ కామెంట్ పై సోషల్ మీడియాలో విభిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే తాజాగా అతడి ట్విట్టర్ ఖాతాలో జగన్ రియల్ హీరో, చంద్రబాబు రీల్ హీరో అంటూ ఓ పోస్టు చేశాడు. అది ప్రస్తుతం వైరల్ గా మారింది.