వివాహేతర సంబంధాలు ఎంత దూరం దారి తీస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్షణికావేశంలో ఏమైనా చేస్తుంటారు. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడిన సందర్భాలు ఉన్నాయి. కుటుంబపెద్ద దిక్కు లేక ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు కూడా ఉన్నాయి. అయితే ఇటువంటి ఘటనలు జరగకుండా..మంచి చెప్పాల్సిన పోలీసులే ఇలా వివాహేతర సంబంధాలు పెట్టుకుంటే ఇక వాళ్లు చెప్పే మాటలు సామాన్య ప్రజలు వింటారా.. అనే ప్రశ్న తలెత్తుతోంది.
తాజాగా జరిగిన ఘటనలో ఓ వివాహితతో స్థానిక ఎస్సై వివాహాతేర సంబంధం సాగించాడు. దీంతో ఓ రోజు అతడిని ఆమె భర్త రెడ్ హ్యండెడ్‌గా పట్టుకుని చితకబాదాడు. ఈ ఘటన వనపర్తి జిల్లాలోని కొత్తకోటలో వెలుగు చూసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వనపర్తి రూరల్ ఎస్ఐగా పనిచేస్తున్నషేక్ షఫీ కొంతకాలంగా కొత్తకోటకు చెందిన వివాహితతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు.
అతడు ఆమెతో ఫోన్లో మాట్లాడుతూ.. భర్త లేని సమయంలో ఇంటికి వెళ్లి రాసలీలు కొనసాగిస్తున్నాడు. ఈ విషయాన్ని ఆమె భర్త స్థానికులు, స్నేహితుల సహాయంతో తెలుసుకున్నాడు. ఇద్దరినీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవాలని స్కెచ్ వేశాడు. అలా అతడు బయటకు వెళ్తున్నట్లు చెప్పి.. పక్కే సమీపంలో కాపు కాశాడు. దీంతో ఆ మహిళ అనుకున్నట్లుగానే ఎస్సైకి ఫోన్ చేసి.. ఇంటికి రప్పించింది.
ఇద్దరూ రాసలీలల్లో మునిగితేలుతుండగా భర్త స్నేహితుల సాయంతో వారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. కుటుంబసభ్యులతో కలిసి అతడిపై విచక్షణారహితంగా దాడి చేశారు. దీనిపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ఎస్ఐని కాపాడి వనపర్తి దవాఖానకు తరలించారు. దీనిని సీరియస్ గా తీసుకున్న పోలీసులు ఎస్సై షేక్ షఫీని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…